Andhra Pradesh: ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 331 స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీకి నోటిఫికేషన్..

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 331 స్పెషలిస్ట్ డాక్టర్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు ఈ వివరాలను వెల్లడించారు.

Andhra Pradesh: ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 331 స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీకి నోటిఫికేషన్..
Doctor
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 29, 2023 | 9:56 AM

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 331 స్పెషలిస్ట్ డాక్టర్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు ఈ వివరాలను వెల్లడించారు. 14 స్పెషాలిటీల్లో డాక్టర్ల నియామకానికి జులై 5, 7, 10 తేదీల్లో ప్రత్యక్ష నియామకాలు చేపపట్టనున్నట్లు తెలిపారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ విధానంలో గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అభ్యర్థులు.. విజయవాడ, గొల్లపూడిలో ఉన్న ఏపీవివిపీ కమీషనర్ కార్యాలయంలో వాకిన్ రిక్రూట్మెంట్‌కు హాజరు కావాలని సూచించారు.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలకోసం cfw.ap.nic.in, hmfw.ap.gov.in వెబ్సైట్‌లలో చూడొచ్చని తెలిపారు. ఇతర వివరాల కోసం 06301138782 ఫోన్ నంబరుకు గానీ, apvvpwalkinrecruitment@gmail.com ఇమెయిల్ కు గానీ సంప్రదించాలని సూచించారు. తాజా నియామకాల్లో కాంట్రాక్ట్ పోస్టులకు స్థానికత, రోస్టర్ విధానంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చిందని శ్రీనివాసరావు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..