AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: యువతకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి కల్లా 176 స్కిల్‌ హబ్స్‌..10 వేల మందికి లబ్ధి చేకూరేలా..

ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే 66 స్కిల్ హబ్‌ల ఏర్పాటుతో ప్రస్తుతం 2,400 మంది శిక్షణ పొందుతున్నారు. మిగతా 111 స్కిల్ హబ్ ల ఏర్పాటు దిశగా మంత్రి దిశానిర్దేశం చేశారు.

Andhra Pradesh: యువతకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి కల్లా 176 స్కిల్‌ హబ్స్‌..10 వేల మందికి లబ్ధి చేకూరేలా..
Cm Jagan
Basha Shek
| Edited By: |

Updated on: Nov 18, 2022 | 7:00 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ యువతకు జగన్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. ఉన్నత చదువులు అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువకులకు మరిన్ని నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా స్కిల్ హబ్‌లను ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని స్కిల్ హబ్‌లు ప్రారంభం కాగా.. మిగిలిన వాటిని కూడా ఈ సంక్రాంతి కల్లా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విజయవాడలోని రాష్ట్ర ఆర్థిక సంస్థ కార్యాలయంలో స్కిల్ హబ్‌లు, కాలేజీల పురోగతిపై ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, నైపుణ్య, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి కల్లా 176 స్కిల్ హబ్ ల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాగా ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే 66 స్కిల్ హబ్‌ల ఏర్పాటుతో ప్రస్తుతం 2,400 మంది శిక్షణ పొందుతున్నారు. మిగతా 111 స్కిల్ హబ్ ల ఏర్పాటు దిశగా మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రతి స్కిల్ హబ్ లో 2 కోర్సుల చొప్పిున మొత్తం 222 కోర్సులలో శిక్షణకు సిద్ధంగా ఉండాలని మంత్రి బుగ్గన ఆదేశించారు.

కాగా 176 స్కిల్ హబ్ లు అందుబాటులోకి తీసుకువచ్చి 10 వేల మందికిపైగా యువతకు నైపుణ్య, శిక్షణ అందించేలా అడుగులు వేయాలని మంత్రి కోరారు. శిక్షణ కేంద్రాలలో యువతకు ఆహారం, పరిశుభ్ర, ప్రశాంత వాతావరణం వంటి మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దడంలో రాజీపడొద్దని ఆదేశించారు. స్కిల్ కాలేజీలు ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ లు, ల్యాబ్, ట్రైనర్ వంటి అంశాలపై ఇవాళ ఆయన సమీక్షించారు. సాంకేతిక విద్య, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లతో ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలపైనా ఆరా తీశారు. కాగా నవంబర్ 24,25,26 తేదీలలో సాంకేతిక విద్య ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఏపీ పాలి టెక్ ఫెస్ట్ -2022కి ముఖ్య అతిథిగా హాజరవ్వాలని మంత్రికి ఆహ్వానం అందించారు సాంకేతిక విద్యా డైరెక్టర్ నాగరాణి. ఈ సమావేశంలో ఐ.టీ, నైపుణ్య, శిక్షణ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ ఎస్.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్