AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAPCET 2025 Top Rankers List: ఈఏపీసెట్‌ ఫలితాల్లో టాప్‌ ర్యాంకర్లు వీరే.. ఎవరికెన్ని మార్కులొచ్చాయంటే?

ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు ఆదివారం (జూన్‌ 8) సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం 75.67 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. తాజా ఫలితాల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లలో అబ్బాయిలే టాప్‌ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. టాపర్స్ లిస్ట్ ఈ కింద చెక్ చేసుకోవచ్చు..

AP EAPCET 2025 Top Rankers List: ఈఏపీసెట్‌ ఫలితాల్లో టాప్‌ ర్యాంకర్లు వీరే.. ఎవరికెన్ని మార్కులొచ్చాయంటే?
Eamcet 2025 Toppers
Srilakshmi C
|

Updated on: Jun 09, 2025 | 7:20 AM

Share

అమరావతి, జూన్‌ 9: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు ఆదివారం (జూన్‌ 8) సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం 75.67 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. తాజా ఫలితాల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లలో అబ్బాయిలే టాప్‌ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన అవనగంటి అనిరుధ్‌ రెడ్డి 96.39 మార్కులతో ఫస్ట్‌ ర్యాంకు సాధించగా.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మాండవ్యపురం భాను చరణ్‌ రెడ్డి 95.57 మార్కులతో సెకండ్ ర్యాంక్‌, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్‌ సాత్విక్‌ 94.75 మార్కులతో మూడో ర్యాంక్‌ కైవసం చేసుకున్నారు.

ఏపీ ఈఏపీసెట్‌ 2025 ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ టాపర్లు వీరే..

  • అవనగంటి అనిరుధ్‌ రెడ్డి.. ఫస్ట్‌ ర్యాంక్‌ (హైదరాబాద్‌)
  • మాండవ్యపురం భాను చరణ్‌ రెడ్డి.. సెకండ్ ర్యాంకు (తిరుపతి)
  • కోటిపల్లి యశ్వంత్‌ సాత్విక్‌ థార్డ్‌.. ర్యాంకు (పశ్చిమగోదావరి జిల్లా)
  • యు. రామచరణ్‌ రెడ్డి.. నాలుగో ర్యాంకు (నంద్యాల జిల్లా)
  • భూపతి నితిన్‌ అగ్నిహోత్రి.. ఐదో ర్యాంకు (అనంతపురం న్యూటౌన్‌)
  • టి.విక్రమ్‌ లేవి.. ఆరో ర్యాంకు (గుంటూరు)
  • దేశిరెడ్డి మణిదీప్‌ రెడ్డి.. ఏడో ర్యాంకు (చిత్తూరు జిల్లా)
  • ఎస్‌. త్రిశూల్‌.. ఎనిమిదో ర్యాంకు (హన్మకొండ)
  • ధర్మాన జ్ఞాన రుత్విక్‌ సాయి.. తొమ్మిదో ర్యాంకు (శ్రీకాకుళం)
  • భద్రిరాజు వెంకటమణి ప్రీతమ్‌.. పదో ర్యాంకు (కందుకూరు)

అగ్రికల్చర్‌, ఫార్మా స్ట్రీమ్‌లలో టాపర్లు వీరే..

  • రామాయణం వెంకట నాగసాయి హర్షవర్దన్‌- కృష్ణా జిల్లా
  • షన్ముఖ నిశాంత్‌ అక్షింతల – రంగారెడ్డి జిల్లా
  • డేగల అకీరనంద వినయ్‌ మల్లేశ్‌ కుమార్‌ – కోనసీమ
  • వై.షణ్ముఖ్‌ – హన్మకొండ
  • యెలమోలు సత్య వెంకట్‌ – పశ్చిమగోదావరి
  • సిరిదెళ్ల శ్రీ సాయి గోవర్దన్‌ – కాకినాడ
  • జి. లక్ష్మీ చరణ్‌ – విశాఖ
  • దర్భ కార్తిక్‌ రామ్‌ కిరీటి- తూర్పుగోదావరి
  • కొడవటి మోహిత్‌ శ్రీరామ్‌ – తూర్పుగోదావరి
  • దేశిన సూర్య చరణ్‌ – కాకినాడ

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.