AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anganwadi Jobs: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా 14,236 పోస్టులు.. నియామక నోటిఫికేషన్‌ ఎప్పటికి వచ్చేనో?

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు 14,236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా చోట్ల టీచర్లు, హెల్పర్లు లేకపోవడంతో రోజువారీ నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యా బోధన, పోషకాహారం అందించడం సాధ్యపడటం లేదు. మరోవైపు పక్కా భవనాలు, సిబ్బంది లేకపోవడంతో..

Anganwadi Jobs: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా 14,236 పోస్టులు.. నియామక నోటిఫికేషన్‌ ఎప్పటికి వచ్చేనో?
Anganwadi Job Vacancies
Srilakshmi C
|

Updated on: Jul 06, 2025 | 2:52 PM

Share

హైదరాబాద్‌, జులై 6: తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు 14,236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా చోట్ల టీచర్లు, హెల్పర్లు లేకపోవడంతో రోజువారీ నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యా బోధన, పోషకాహారం అందించడం సాధ్యపడటం లేదు. మరోవైపు పక్కా భవనాలు, సిబ్బంది లేకపోవడంతో ఏజెన్సీల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నెలకోసారైనా తెరిచే పరిస్థితి లేకుండా పోయింది. 65 ఏళ్లు నిండిన ఉద్యోగులు పదవీ విరమణ చేస్తుండటంతో.. ఆ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడంతో పోస్టుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టుల భర్తీకి శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు కూడా. కానీ నోటిఫికేషన్‌ జారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా దీనిపై సమీక్ష జరిపిన మంత్రి సీతక్క వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కాగా రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక టీచర్‌, ఒక హెల్పర్‌ తప్పనిసరి. అయితే ఈ పోస్టులకు ఎంపికైన వారిలో కొంత మంది రాజీనామా చేయడం, మరికొందరు సూపర్‌వైజర్లుగా పదోన్నతులు పొందడంతో విపరీతంగా ఖాళీలు పెరిగాయి. మొత్తం ఖాళీల్లో 6,399 టీచర్‌ పోస్టులు, 7,837 హెల్పర్‌ పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడి స్థానిక ఆదివాసీలు, గిరిజనుల్ని ఈ పోస్టులకు నియమించి, వారితోనే పూర్వప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉండేవి. ఈ రిజర్వేషన్ల జీవోని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

దీంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర శిశు సంక్షేమశాఖ తర్జనభర్జన పడుతోంది. ఒకవేళ సాధారణ ఉద్యోగ ప్రకటన కింద నోటిఫికేషన్‌ ఇస్తే మాతృభాషలో విద్యాబోధన దాదాపు ఆసాధ్యం. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు ఏవిధంగా చేపడుతున్నారో అధ్యయనం చేసి ఆనక నోటిఫికేషన్‌ ఇవ్వాలని మంత్రి సీతక్క భావించారు. దీంతో ఈ అధ్యయన నివేదిక వచ్చిన తర్వాతనే ఉద్యోగ ప్రకటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.