AP TET 2024 Answerkey Download: టెట్‌లో అన్ని సబ్జెక్టుల ప్రిలిమినరీ ‘కీ’లు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ తేదీ ఇదే

ఏపీ టెట్ జులై-2024 ఆన్ లైన్ పరీకలు ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా అన్ని సబ్జెక్టుల పరీక్షల ఆన్సర్ కీలను విద్యాశాఖ విడుదల చేసింది. వీటిపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 27వ తేదీన తుది ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు వెబ్ సైట్ నుంచి వీటిని..

AP TET 2024 Answerkey Download: టెట్‌లో అన్ని సబ్జెక్టుల ప్రిలిమినరీ 'కీ'లు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ తేదీ ఇదే
AP TET 2024 Answer Key download
Follow us

|

Updated on: Oct 23, 2024 | 4:15 PM

అమరావతి, అక్టోబర్‌ 23: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్ జులై-2024) పరీక్షలు అక్టోబర్‌ 21వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 17 రోజులపాటు జరిగిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,68,661 మంది హాజరయ్యారు. మొత్తం 4,27,300 మంది టెట్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. 86.28 శాతం మంది పరీక్షలు రాశారు. ఇక అక్టోబర్‌ 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగిన అన్ని సబ్జెక్టుల క్వశ్చన్‌ పేపర్లను, వాటి ఆన్సర్‌ కీలను సెషన్ల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అక్టోబర్ 23వ తేదీ నుంచి అన్ని సబ్జెక్టుల ప్రిలిమినరీ కీలను వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆన్సర్‌ కీతోపాటు అభ్యర్ధుల రెస్పాన్స్‌ షీట్లను కూడా విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. పేపర్‌ 2ఎ సోషల్ స్టడీస్‌ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’లపై అభ్యంతరాలను అక్టోబర్‌ 25వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేయాలని అభ్యర్ధులకు సూచించారు. ఇక టెట్‌ తుది ఆన్సర్‌ ‘కీ’ అక్టోబర్‌ 27వ తేదీన విడుదల చేస్తారు. నవంబర్‌ 2న టెట్‌ ఫలితాలను ప్రకటిస్తారు.

ఏపీ టెట్ జులై 2024 క్వశ్చన్‌ పేపర్లు, ఆన్సర్‌ కీల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా టెట్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే దాదాపు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కూటమి సర్కార్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త సర్కార్‌ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపై చేశారు కూడా. ఇక ప్రస్తుతం డీఎస్సీలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు నిర్వహించిన టెట్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. వచ్చే నెలలో వెలువడనున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మెగా డీఎస్సీ మొత్తం పోస్టుల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు 6,371, స్కూల్‌ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులు 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (టీజీటీలు) పోస్టులు 1781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్ (పీజీటీలు) పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయ (పీఈటీలు) పోస్టులు 132 వరకు ఉన్నాయి. ఈ సారి భారీగా పోస్టులు ఉండటంతో నిరుద్యోగులంతా పోటాపోటీగా సన్నద్ధం అవుతున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.