AP SSC Supply Exams 2024: మే 24 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మే 24 నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,61,877 మంది విద్యార్ధులు హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మే 24 నుంచి జూన్‌ 3 వరకు ఆయా తేదీల్లో..

AP SSC Supply Exams 2024: మే 24 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు
AP SSC Supply Exams 2024
Follow us
Srilakshmi C

|

Updated on: May 21, 2024 | 6:44 AM

అమరావతి, మే 21: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మే 24 నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,61,877 మంది విద్యార్ధులు హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మే 24 నుంచి జూన్‌ 3 వరకు ఆయా తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని దేవానందరెడ్డి వెల్లడించారు. వెబ్‌సైట్లో హాల్‌టికెట్లను విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా వీలుకల్పించినట్లు తెలిపారు.

మే 24న ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌, మే 25న సెకండ్‌ ల్యాంగ్వేజ్‌, మే 27న ఇంగ్లిష్‌, మే 28న మ్యాథమెటిక్స్‌, మే 29న ఫిజికల్ సైన్స్, మే 30న జీవ శాస్త్రం, మే 31న సాంఘికశాస్త్రం పరీక్షలు ఉంటాయని అన్నారు. అలాగే జూన్‌ 1, 3 తేదీల్లో ఓఎస్‌ఎస్‌ పేపర్‌-1, 2 పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు కూడా సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చు. సప్టిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులను తదుపరి దశకు ప్రమోట్ అవుతారని ఎస్సెస్సీ బోర్డు స్పష్టం చేసింది.

 ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పెళ్లైన ఆ స్టార్ హీరోతో ఎఫైర్.. కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్
పెళ్లైన ఆ స్టార్ హీరోతో ఎఫైర్.. కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్
బాయ్‌ఫ్రెండ్‌తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ.. ఫొటోస్
బాయ్‌ఫ్రెండ్‌తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ.. ఫొటోస్
ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో చెట్ల నరికివేత
ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో చెట్ల నరికివేత
రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు