AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP RGUKT Counseling 2025: ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించింది. నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు- ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు) 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పీయూసీ-బీటెక్‌ (రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్) ప్రవేశాలకు..

AP RGUKT Counseling 2025: ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?
RGUKT IIIT admissions
Srilakshmi C
|

Updated on: Jul 01, 2025 | 3:56 PM

Share

నూజివీడు, జులై 1: ఏపీలోని ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించింది. నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు- ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు) 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పీయూసీ-బీటెక్‌ (రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్) ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధుల నుంచి ఏప్రిల్‌ 27 నుంచి మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి 15 శాతం సీట్లు భర్తీ చేయనున్నారు.

సర్కార్ బడుల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్‌ స్కోర్‌ను యాడ్‌ చేసి మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇందులో భాగంగా నూజివీడు క్యాంపస్‌లో జూన్‌ 30న కౌన్సెలింగ్‌ను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, నూజివీడు డైరెక్టర్‌ ఆచార్య అమరేంద్రకుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూజివీడు, ఆర్కే వ్యాలీలో కలిపి తొలిరోజు 1010 సీట్లు కేటాయించామన్నారు. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 4 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌ అనంతరం జులై 14 నుంచి తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

డా బీఆర్‌ అంబేడ్కర్ వర్సిటీ 2025-26 ప్రవేశాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ బీఏ, బీకాం, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ కోర్సులు, బిఎల్‌ఐఎసీ, ఎంఎల్ఐఎసీ, పీజీ డిప్లమో, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2025-2026 విద్యా సంవత్సరం ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న అధ్యయన కేంద్రాలను మాత్రమే విద్యార్ధులు ఎంచుకోవాలని వర్సిటీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..