Inter Advanced Supplementary Exams 2025: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెరిగిందోచ్! ఎప్పటి వరకంటే..
ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. సప్లిమెంటరీ పరీక్షలు రాయగోరే విద్యార్ధులకు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. అయితే తాజాగా ఫీజు గడువును పొడిగిస్తూ..

అమరావతి, మే 4: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెలలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. సప్లిమెంటరీ పరీక్షలు రాయగోరే విద్యార్ధులకు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. అయితే తాజాగా ఫీజు గడువును పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన ఇచ్చింది. సోమవారం (మే 5) వరకు ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇప్పటి వరకు ఫీజులు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఇదే చివరి అవకాశమని, మరోసారి పొడిగింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.
కాగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయి. అంటే ఉదయం ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయన్నమాట. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. ఇంటర్ అడ్వాన్స్‌డ్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్ ఈ కింద చెక్ చేసుకోవచ్చు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్ 2025 ఇదే..
- మే 12.. సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
- మే 13.. ఇంగ్లీష్ పేపర్ 1
- మే 14.. మ్యాథ్స్ పేపర్ 1A, బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1
- మే 15.. మ్యాథ్స్ పేపర్ 1B, జువాలజీ 1, హిస్టరీ 1
- మే 16.. ఫిజిక్స్ పేపర్ 1, ఎకానమిక్స్ పేపర్ 1
- మే 17.. కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1
- మే 19.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ 1 (బైపీసీ విద్యార్థులకు)
- మే 20.. మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1
ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ 2025 టైమ్ టేబుల్..
- మే 12.. సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
- మే 13.. ఇంగ్లీష్ పేపర్ 2
- మే 14.. మ్యాథ్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2
- మే 15.. మ్యాథ్స్ పేపర్ 2B, జువాలజీ 2, హిస్టరీ 2
- మే 16.. ఫిజిక్స్ పేపర్ 2, ఎకానమిక్స్ పేపర్2
- మే 17.. కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2
- మే 19.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ 2 (బైపీసీ విద్యార్థులకు)
- మే 20.. మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జాగ్రఫీ పేపర్ 2
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




