కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పట్నాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. గ్రూప్ ఎ, బి, సి కేటగిరీల్లో కింది 644 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ ప్రోగ్రామర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సీనియర్ డైటీషియన్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, పబ్లిక్ హెల్త్ నర్స్, మెడికో సోషల్ వర్కర్, యోగా ఇన్‌స్ట్రక్టర్, ప్రైవేట్ సెక్రటరీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, 10+2, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 4, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు మే 6 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.3000లు, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.2400లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.2,08,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.