AIIMS Mangalagiri Senior Resident Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS).. సీనియర్ రెసిడెంట్/ సీనియర్ డెమాన్‌స్ట్రేటర్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 6
ఖాళీల వివరాలు: సీనియర్ రెసిడెంట్/ సీనియర్ డెమాన్‌స్ట్రేటర్ పోస్టులు
విభాగాలు: బయోకెమిస్ట్రీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పీడియాట్రిక్స్, పల్మనరీ మెడిసిన్, రేడియోడయాగ్నసిస్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్:
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎంఎస్/ డీఎన్‌బీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు జిల్లా, ఏపీ-522503.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే పూర్తి చేసిన అప్లికేషన్ ఫాంను ఫిల్ చేసి, ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి.
ఈ మెయిల్ ఐడీ: recruitment.helpdesk@aiimsmangalagiri.edu.in
దరఖాస్తు రుసుము:
ఇంటర్వ్యూ తేదీ: జులై 28, 2022.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.