ITR Refund: మీ ఐటీఆర్ రీఫండ్ ఇంకా క్రెడిట్ కాలేదా? ఈ సింపుల్ స్టెప్స్‌తో స్టేటస్ తెలుసుకోండిలా..!
ఆదాయపు పన్ను శాఖ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 6.77 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖల చేశారు. ఇందులో దాదాపు 5.63 కోట్ల ఐటీఆర్‌లు ధ్రువీకరించారు. అలాగే ఆదాయపు పన్ను శాఖ 3.44 కోట్ల ఐటీఆర్‌లను ప్రాసెస్ చేసింది. అంటే పెద్ద సంఖ్య చెల్లింపుదారులు ఇప్పటికే తమ రీఫండ్స్‌ను స్వీకరించారు. ఐటీఆర్ రీఫండ్ సాధారణంగా రిటర్న్ దాఖలు చేసిన రోజు నుంచి 7 నుండి 120 రోజులలోపు జారీ చేస్తారు. సాంకేతిక పరిణామాలతో వాపసుల కోసం సగటు ప్రాసెసింగ్ సమయం చాలా తగ్గింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి జరిమానా లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది. ఐటీఆర్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు తమ పన్ను రిటర్న్ కోసం వేచి చూస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 6.77 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖల చేశారు. ఇందులో దాదాపు 5.63 కోట్ల ఐటీఆర్‌లు ధ్రువీకరించారు. అలాగే ఆదాయపు పన్ను శాఖ 3.44 కోట్ల ఐటీఆర్‌లను ప్రాసెస్ చేసింది. అంటే పెద్ద సంఖ్య చెల్లింపుదారులు ఇప్పటికే తమ రీఫండ్స్‌ను స్వీకరించారు. ఐటీఆర్ రీఫండ్ సాధారణంగా రిటర్న్ దాఖలు చేసిన రోజు నుంచి 7 నుండి 120 రోజులలోపు జారీ చేస్తారు. సాంకేతిక పరిణామాలతో వాపసుల కోసం సగటు ప్రాసెసింగ్ సమయం చాలా తగ్గింది. కాబట్టి మీరు మీ పన్ను వాపసును ఇంకా అందుకోకపోతే మీరు మీ ఐటీఆర్‌ను ఈ-ధృవీకరించారో? లేదో? తనిఖీ చేయాలి. మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఈ-ధృవీకరించకుంటే ఫైలింగ్ ప్రక్రియ అసంపూర్తిగా పరిగణిస్తారు. అంటే మీ ఐటీఆర్ చెల్లదని గమనించాలి. ప్రస్తుతం చాలా సింపుల్ మన ఐటీఆర్ రీఫండ్ స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.
ఐటీఆర్ రీఫండ్ చెక్ చేసుకునే విధానం
- స్టెప్-1: ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- స్టెప్-2: మీ నమోదిత యూజర్ ఐడీ అంటే పాన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ని ఉపయోగించి పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.
- స్టెప్-3: అక్కడ రిటర్న్స్ ఫారమ్‌ను ఎంచుకోవాలి
- స్టెప్-4: అక్కడ డ్రాప్-డౌన్ జాబితా నుంచి ‘సెలెక్ట్ యాన్ ఆప్షన్’ లింక్‌పై క్లిక్ చేసి, ఆపై ‘ఆదాయ పన్ను రిటర్న్స్’ లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్-5: అసెస్‌మెంట్ ఇయర్‌ని ఎంటర్ చేసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్-6: వివరాలను తనిఖీ చేయడానికి ఐటీఆర్ వాపసు స్థితిని వీక్షించడానికి ఐటీఆర్ రసీదు సంఖ్యపై క్లిక్ చేయాలి. అక్కడ ఫారమ్ 26 ఏఎస్‌లోని ‘టాక్స్ క్రెడిట్ స్టేట్‌మెంట్స్’లో ‘రిఫండ్ చెల్లింపు’ స్థితిని తెలుసుకోవచ్చు.
ఐటీఆర్ రీఫండ్ ఆలస్యానికి కారణాలు
- పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఫైల్ చేసేటప్పుడు సరైన బ్యాంక్ ఖాతా నంబర్ లేదా ఇతర బ్యాంక్ సమాచారాన్ని పొందుపర్చకపోతే రీఫండ్ ఆలస్యం అవుతుంది.
- పన్ను ప్రయోజనాన్ని పొందడానికి పన్ను చెల్లింపుదారులు తగినంత లేదా తప్పుడు సమాచారాన్ని నమోదు చేసి ఉండవచ్చు. దీన్ని సరిచేయడానికి కస్టమర్లు రీఫండ్ ప్రక్రియలో తిరస్కరణ లేదా ఆలస్యాన్ని పరిమితం చేయడానికి కచ్చితమైన సంబంధిత సమాచారాన్ని సమర్పించాలి.
- 26 ఏఎస్‌లో క్లెయిమ్ చేసిన టీడీఎస్‌లో అసమానతలు ఉన్నా ఐటీఆర్ రీఫండ్ ఆలస్యం అవుతుంది.
- ఒకవేళ ఏదైనా అదనపు డాక్యుమెంటేషన్ లేదా సమాచారం కావాల్సి వచ్చినా ఐటీఆర్ రీఫండ్ ఆలస్యం కావచ్చు. ఈ సమాచారం కోసం మీకు ఇప్పటికే మెయిల్ వచ్చి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి