Credit Card Cashback: క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి? దీని వల్ల ఉపయోగాలు ఏమిటి?

మీరు బ్రాండ్‌ల కోసం లేదా కార్డ్‌తో అనుబంధించిన ప్లాట్‌ఫారమ్‌ల కోసం షాపింగ్ చేసినప్పుడు మీరు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను పొందుతారు. అమెజాన్‌ లాగా, మీరు ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, జోమాటో మొదలైనవాటిలో షాపింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను పొందుతారు. అందుకే మీరు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎక్కువ ఖర్చు చేసినా, మీరు ప్రతి షాపింగ్, ప్రతి ఆర్డర్‌తో క్యాష్‌బ్యాక్ రూపంలో డిస్కౌంట్లను పొందుతారు. క్యాష్‌బ్యాక్ అనేది ఈ క్రెడిట్ కార్డ్‌లతో లభించే సులభమైన ప్రయోజనం. డబ్బు ఖర్చు చేయండి..

Credit Card Cashback: క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి? దీని వల్ల ఉపయోగాలు ఏమిటి?
Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: Aug 09, 2023 | 8:00 PM

క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేసిన ప్రతిసారీ.. తనకు క్యాష్‌బ్యాక్ వస్తుందని ప్రీతి అజయ్‌తో చెప్పింది. ప్రీతి తన కార్డ్ నుంచి iPhone-14 తీసుకున్నప్పుడు దాని ఆన్‌లైన్ ధర రూ. 67,000 ఉంది. అయితే 3,000 క్యాష్‌బ్యాక్‌తో 64,000కి ఫోన్ వచ్చింది. క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటో తెలుసుకుందాం.. ఈ కార్డ్‌లను క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లు అంటారు. సాధారణంగా క్రెడిట్ కార్డ్‌లలో ఎక్కువ ఖర్చు చేస్తే మీకు రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్లు మొదలైనవి లభిస్తాయి. కానీ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లలో ఈ-షాపింగ్ వెబ్‌సైట్‌లో ప్రతి ఖర్చుతో క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. కార్డ్ కంపెనీలు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ల ఆధారంగా ఎక్కువ మంది కస్టమర్‌లను చేర్చుకుంటాయి. అలాగే ఈ క్యాష్‌బ్యాక్ కారణంగా షాపింగ్ వెబ్‌సైట్‌లు ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి.

మీరు బ్రాండ్‌ల కోసం లేదా కార్డ్‌తో అనుబంధించిన ప్లాట్‌ఫారమ్‌ల కోసం షాపింగ్ చేసినప్పుడు మీరు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను పొందుతారు. అమెజాన్‌ లాగా, మీరు ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, జోమాటో మొదలైనవాటిలో షాపింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను పొందుతారు. అందుకే మీరు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎక్కువ ఖర్చు చేసినా, మీరు ప్రతి షాపింగ్, ప్రతి ఆర్డర్‌తో క్యాష్‌బ్యాక్ రూపంలో డిస్కౌంట్లను పొందుతారు. క్యాష్‌బ్యాక్ అనేది ఈ క్రెడిట్ కార్డ్‌లతో లభించే సులభమైన ప్రయోజనం. డబ్బు ఖర్చు చేయండి.. దానిపై క్యాష్‌బ్యాక్ పొందండి. రివార్డ్‌లు లేదా వోచర్‌ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ముందుగా మీ నెలవారీ ఖర్చులను అంచనా వేయాలి. మీరు ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నారో కూడా గమనించాలి.

మీరు అమెజాన్‌ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, మింత్రా కోటాక్‌ క్రెడిట్ కార్డ్‌ల గరించి విని ఉండవచ్చు. మీరు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను ప్రతి ఆర్డర్‌పై 1.25% నుంచి 5% వరకు పొందవచ్చు. ఎస్‌బీహెచ్‌ క్రెడిట్ కార్డ్‌తో ప్రారంభించి.. మీరు ఈ కార్డ్‌తో అన్ని రకాల ఆన్‌లైన్ ఖర్చులపై 5% క్యాష్‌బ్యాక్, ఆఫ్‌లైన్ ఖర్చులపై 1% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇక్కడ మీరు విద్యుత్, ఇంటర్నెట్, గ్యాస్, DTH, మొబైల్ రీఛార్జ్ మొదలైన వాటి కోసం గూగుల్‌పే ద్వారా చేసిన చెల్లింపులపై 5% క్యాష్‌బ్యాక్ పొందుతారు. మీరు స్విగ్గీ, జోమాటో ఆర్డర్‌లు లేదా Ola క్యాబ్ బుకింగ్‌లపై కూడా 4% క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా మీరు ఇతర రకాల ఖర్చులపై 2% క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు. ఎయిర్‌టెల్‌ యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఎయిర్‌టెల్‌ థాంక్స్ యాప్ ద్వారా ఎయిర్‌టెల్‌ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, వైఫై, డీటీహెచ్‌ బిల్లుల కోసం బిల్లులు చెల్లించడానికి 25% క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. అదనంగా మీరు స్విగ్గీ, జోమాటో, బిగ్‌బస్కెట్‌ వంటి కిరాణా డెలివరీ యాప్‌లపై షాపింగ్ చేయడానికి 10% క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ ఆఫర్‌లతో పాటు మీరు ఇతర అనేక ఖర్చులపై 1% క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు.

ఇవి కూడా చదవండి

మిలీనియా క్రెడిట్ కార్డ్‌తో మీరు అమెజాన్‌, మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌, బుక్‌మైషో, ఉబర్‌ వంటి వివిధ యాప్‌లపై 5% క్యాష్‌బ్యాక్ పొందుతారు. మీరు ఇతర రకాల ఖర్చులపై 1% క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు. ఈ విధంగా మీరు చిన్న షాపింగ్ లావాదేవీలు చేసిన ప్రతిసారీ పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు.

మరొక రకమైన క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందా.. ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీలు కూడా ఈ వర్గంలో చాలా కార్డ్ లు తీసుకువచ్చాయి. ఉదాహరణకు, మీరు ఆన్‌లైన్‌లో ఎక్కువ షాపింగ్ చేస్తే మీరు GooglePay ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తే.. మీరు Axis బ్యాంక్ Ace క్రెడిట్ కార్డ్‌ని తీసుకోవచ్చు. మీరు సంవత్సరానికి నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేస్తే దీనిపై విధించే వార్షిక రుసుము కూడా మాఫీ చేస్తారు. క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌ల పూర్తి వివరాలు అర్థం చేసుకుంటే చాలా మంచిది. అవసరాలకు అనుగుణంగా క్రెడిట్ కార్డ్‌ని వాడుతూ డబ్బును పొదుపు చేసుకోండి. ఈ విధంగా మీరు రోజువారీ షాపింగ్ లావాదేవీలు చేసిన ప్రతిసారీ పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. అమెజాన్‌ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ మినహా.. మీరు అన్ని ఇతర కార్డ్‌లకు వార్షిక రుసుము చెల్లించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
ఈ చాయ్‌ ధర రూ.1 లక్షకుపైనే.. ఈ టీ కప్పు రహస్యం ఏంటి..?
ఈ చాయ్‌ ధర రూ.1 లక్షకుపైనే.. ఈ టీ కప్పు రహస్యం ఏంటి..?
పుష్ప 2 నుంచి మరో క్రేజీ అప్డేట్..
పుష్ప 2 నుంచి మరో క్రేజీ అప్డేట్..
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు