AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ తక్కువొస్తుందని చింతిస్తున్నారా..! అయితే ఇక్కడ పెట్టుబడి పెట్టండి.. టెన్షన్ తొలగించుకోండి

గత రెండు సంవత్సరాలుగా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించారు. దీంతో సామాన్యులు అధిక వడ్డీరేట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకోసం

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ తక్కువొస్తుందని చింతిస్తున్నారా..! అయితే ఇక్కడ పెట్టుబడి పెట్టండి.. టెన్షన్ తొలగించుకోండి
Money
uppula Raju
|

Updated on: Jul 30, 2021 | 11:52 AM

Share

గత రెండు సంవత్సరాలుగా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించారు. దీంతో సామాన్యులు అధిక వడ్డీరేట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకోసం మంచి ఫ్లాట్ ఫాంల గురించి వెతుకుతున్నారు. పెట్టుబడిదారులు ఇప్పుడు ఎఫ్‌డికి ప్రత్యామ్నాయంగా మ్యూచువల్ ఫండ్ వర్గాన్ని ఎంచుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తక్కువగా నిర్ణయించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలలో తగిన నిధులు అందుబాటులో ఉన్నాయి. రిటైల్ పెట్టుబడిదారులకు ఇది లాభదాయక ఎంపిక కాదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని FD కి బదులుగా కొన్ని ఇతర పెట్టుబడి ఎంపికల గురించి తెలుసుకుందాం.

ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్‌లు (ఎఫ్‌ఎంపీలు): ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్‌లు.. ఫిక్సెడ్ మెచ్యూరిటీ పీరియడ్, ఫిక్స్‌డ్ కూపన్ రేట్‌తో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందువల్ల ఇన్వెస్టర్లు చాలా కచ్చితత్వంతో రాబడిని అంచనా వేయవచ్చు. వారి పరిపక్వత విలువ ఏమిటో వారు తెలుసుకోవచ్చు.

రోల్ డౌన్ స్ట్రాటజీ : రోల్ డౌన్ స్ట్రాటజీ ఆధారంగా ఓపెన్ ఎండ్ ఫండ్స్ నిధులు మంచి లిక్విడిటీని కలిగి ఉంటాయి. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు పాత పెట్టుబడులను లిక్విడేట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ విలువ, పెట్టుబడి వ్యవధిని అంచనా వేయడం కష్టం. ప్రవేశం, నిష్క్రమణ సౌలభ్యం ఈ ఫండ్ విలువను ప్రభావితం చేస్తుంది.

టార్గెట్ మెచ్యూరిటీ గిల్ట్ ఇండెక్స్ ఫండ్స్: సాధారణంగా టార్గెట్ మెచ్యూరిటీ గిల్ట్ ఇండెక్స్ ఫండ్స్ చాలా లాభదాయకమైనవి. వీరు ప్రధానంగా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతారు. మెచ్యూరిటీ వ్యవధిలో భద్రతతో పాటు పరిపక్వత ఉంటుంది. అందువల్ల టార్గెట్ మెచ్యూరిటీ గిల్ట్ ఫండ్స్ తక్కువ-రిస్క్ ఎంపికగా పరిగణిస్తారు.

ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్లలో రిస్క్ పట్ల జాగ్రత్త అవసరం.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం పిక్స్‌డ్ డిపాజిట్లతో పోల్చితే కొంత ప్రమాదకరమే. టార్గెట్ మెచ్యూరిటీ గిల్ట్ ఇండెక్స్ ఫండ్స్ 6-7 సంవత్సరాల తర్వాత రీ ఇన్వెస్ట్‌మెంట్ సమయంలో కొంచెం ప్రమాదకరంగా మారతాయి. ఎందుకంటే కొత్త సెక్యూరిటీలు ఆ కాలంలో తక్కువ కూపన్ రేట్లను కలిగి ఉంటాయి.

Tokyo Olympics 2021 Live Updates: నవనీత్‌కౌర్ గోల్‌తో ఐర్లాండ్‌పై గెలిచి .. రేస్‌లో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు..

Love – Tragedy: ప్రేమ.. పెళ్లి ఎందుకు ట్రాజెడీగా మారింది.. ఆ నాలుగు గోడల మధ్య గొడవ అందుకే జరిగిందా..

IT Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆ ఐటీ కంపెనీలో లక్ష ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..