Business Ideas : మహిళలు ఈ ఒక్క కోర్సు నేర్చుకుంటే చాలు, ఇంటివద్దే రోజుకు రూ. 10 వేలు సంపాదించే ఛాన్స్
మహిళలు మీరు ఇంటి వద్ద ఉండి డబ్బు సంపాదించాలని, అలాగే మీ ఖాళీ సమయాన్ని వినియోగించుకొని ఆదాయం మార్గం కోసం చూస్తున్నారా.

మహిళలు మీరు ఇంటి వద్ద ఉండి డబ్బు సంపాదించాలని, అలాగే మీ ఖాళీ సమయాన్ని వినియోగించుకొని ఆదాయం మార్గం కోసం చూస్తున్నారా. అయితే ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలోనూ అలాగే ఇతర ఫంక్షన్ల సమయంలోనూ ఈ బిజినెస్ కు చక్కటి డిమాండ్ ఉంటుంది. తద్వారా మీ ఖాళీ సమయాన్ని వినియోగించుకొని చక్కటి ఆదాయాన్ని పొందే వీలుంది. అలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పెళ్లిళ్లలో ఈ మధ్యకాలంలో మెహేంది ఫంక్షన్ల సంస్కృతి భారీ అన్ని వర్గాల్లోనూ పెరిగింది. ఒకప్పుడు కేవలం ఉత్తర భారతీయులకు మాత్రమే పరిమితం అయినటువంటి, ఈ సంస్కృతి పెళ్లికి ముందు రోజు లేదా అంతకుముందే మెహందీ ఫంక్షన్ పేరిట అటు దక్షిణ భారతదేశంలోని కుటుంబాలు సైతం పాటిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యకాలం పెళ్లిళ్లలో మెహందీ ఫంక్షన్లను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్ల ఇంటిలో మెహందీ ఫంక్షన్ పేరిట ఓ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ ఫంక్షన్ల ఫలితంగా మెహందీ ఆర్టిస్టులకు చాలా డిమాండ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా మెహందీ ఆర్టిస్టులు ఈ ఫంక్షన్ లో ఉన్నటువంటి మహిళలు, అందరికీ చక్కటి మెహందీ డిజైన్స్ చేతులకు పెడుతుంటారు. అందుకు వారు చక్కటి మొత్తంలో డబ్బు కూడా వసూలు చేస్తున్నారు. ఇక పెళ్లికూతురు చేతికి పెట్టే మెహందీ డిజైన్స్ కు ప్రత్యేకంగా వసూలు చేస్తుంటారు.
మెహందీ అనేది మన భారతీయ సంస్కృతిలో భాగం. తెలుగు వాళ్ళు కూడా మెహందీ ని గోరింటాకు అంటారు. అయితే సాధారణంగా లభించే గోరింటాకుతో డిజైన్స్ రావు. అందుకే మెహందీ పొడి తో చేసే పేస్టుతో చక్కటి డిజైన్స్ వస్తాయి. అయితే ఈ మెహందీ డిజైన్స్ అనేది ఒక కళ అని చెప్పాలి. ఈ మెహందీ కళ్ళను నేర్చుకోవడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో మెహందీ ఆర్టిస్టులకు చాలా డిమాండ్ ఉంటుంది. మహిళలు మీరు ఖాళీ సమయంలో మెహందీ డిజైన్స్ పెట్టడం నేర్చుకున్నట్లయితే, రోజుకు ప్రతిరోజు వేళల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.




మీరు మెహందీ ఆర్టిస్ట్ కావాలి అనుకుంటే పలు స్వచ్ఛంద సంస్థలు, ఉపాధి శిక్షణా కేంద్రాలు సైతం మెహందీ డిజైనింగ్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి సెట్విన్ సంస్థ కూడా మెహందీ డిజైన్స్ ను సంబంధించిన కోర్సులను నిర్వహిస్తోంది. ఇక మీరు మెహందీ డిజైన్స్ నేర్చుకున్న తర్వాత మెహందీ ఆర్టిస్ట్ గా మారాలి, అనుకుంటే సోషల్ మీడియా ద్వారా కూడా పబ్లిసిటీ చేసి మంచి ఆర్డర్లను పొందే వీలుంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ వేదికలను ఉపయోగించుకొని మీ కలను ప్రదర్శించి ఆర్డర్లను పొందే వీలుంది.
సాధారణంగా ఒక మెహందీ ఆర్టిస్ట్ పెళ్లికూతురు చేతికి మెహందీ పెట్టాలంటే కనీసం వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు చార్జి చేస్తున్నారు. ఈ లెక్కన మెహందీ ఫంక్షన్లలో ఏ రేంజ్ లో డబ్బు సంపాదన చేయవచ్చు మీరే ఊహించుకోవచ్చు. అలాగే బ్యూటీ పార్లర్ లో సైతం మెహందీ డిజైనర్స్ కు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మహిళలు ఈ మెహందీ డిజైన్ కోర్స్ నేర్చుకొని మంచి ఆదాయం పొందే వీలుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం