TVS IQUBE: టీవీఎస్ ఐక్యూబ్‌ను ఫ్రీగా గెలుచుకోండి.. డిసెంబర్ 22 వరకే అవకాశం..!
వ్యాపార అభివృద్ధిలో భాగంగా వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారికి క్యాష్ బ్యాక్‌లు అందిస్తాయి. వాటి ద్వారా కొంత నగదును కస్టమర్‌కు బహుమతిగా ఇస్తాయి. పండగలు, ప్రత్యేక రోజుల్లో ఇలాంటి ఆఫర్లను ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్‌ను కొనుగోలు చేసిన వారికి వందశాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. లక్కీ డ్రాలో గెలుపొందిన కస్టమర్ ఆ స్కూటర్‌ను ఫ్రీగా పొందవచ్చు.
ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల శకం నడుస్తోంది. వివిధ బ్రాండ్లకు చెందిన అనేక మోడళ్లు వరదలా వచ్చి చేరుతున్నాయి. వాటి ఫీచర్లు, ప్రత్యేకతలు, లుక్, పనితనం గురించే ఎక్కడా చూసిన చర్యలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా ఎలక్ట్రిక్ విభాగం వైపే మొగ్గు చూపుతున్నారు. దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో టీవీఎస్ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రిక్ విభాగంలోనూ తన స్థానాన్ని మెరుగుపర్చుకున్న టీవీఎస్ బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. తన ఐక్యూబ్ స్కూటర్‌పై వందశాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది.
టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్ స్కూటర్ అమ్మకాలు మార్కెట్‌లో విజయవంతంగా జరుగుతున్నాయి. ఇటీవల ముగిసిన దసరా సీజన్‌లో అత్యంత ఎక్కువగా అమ్ముడైన వాహనాలలో ఇది కూడా ప్రముఖంగా నిలిచింది. దీని జోరు దేశమంతటా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 4.50 లక్షల ఐక్యూబ్ యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈ మైలురాయిని సెలబ్రేట్ ఘనంగా చేసుకోవాలని కంపెనీ నిర్ణయించుకుంది.దీనిలో భాగంగా వందశాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ స్కూటర్ కొనుగోలు చేసిన వారిలో ఎవరికైనా ఈ లక్ తగిలే అవకాశం ఉంది. ఐక్యూబ్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. డిసెంబర్ 12న మొదలైన ఈ ఆఫర్ 22 వ రకూ మాత్రమే ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈలోపు కొనుగోలు చేసిన వారికి మాత్రమే వందశాతం క్యాష్ బ్యాక్‌ను గెలిచే అవకాశం ఉంటుంది.
మిడ్‌నైట్ కార్నవల్ ఆఫర్ పేరుతో టీవీఎస్ కంపెనీ వంద శాతం క్యాష్ బ్యాక్ అందజేస్తోంది. కంపెనీ నిర్ణయించిన తేదీల్లో ప్రతి రోజూ ఒక లక్కీ కస్టమర్‌ను ఎంపిక చేయనుంది. టీవీఎస్ డీలర్‌షిప్ లేదా వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఈ వంద శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. టీవీఎస్ కంపెనీ ఐక్యూబ్ కొనుగోలుదారులకు రూ.30 వేల వరకూ గ్యారెంటీ బెనిఫిట్స్ అందిస్తుంది. 3.4 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌కు ఐదేళ్లు లేదా 70 వేల కిలోమీటర్లు వారంటీ అందిస్తోంది. అలాగే 2.2 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌కు ఐదేళ్లు లేదా 50 వేల కిలోమీటర్ల అందజేస్తుంది. వివరాలకు మీ సమీపంలోని కంపెనీ డీలర్‌ను సంప్రదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..