Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banking News: మీ బ్యాంక్‌ దివాళా తీస్తే సొమ్ముకు ఎవరు గ్యారెంటీ? నిబంధనలు తెలిస్తే షాకవుతారు..

ఒక్కోసారి బ్యాంక్ వైఫల్యం అనేది ప్రతి కస్టమర్‌కు భయం కలిగిస్తూ ఉంటుంది. అయితే బ్యాంకుల్లో మీ డిపాజిట్ల భద్రత గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించిరా? అలాంటి ఆలోచనలు వస్తే సింపుల్‌ మర్చిపోతే మంచింది. ఎందుకంటే మన డబ్బులో ఎక్కువ భాగం ఆర్‌బీఐ అనుబంధ సంస్థ అయిన డీఐసీజీసీ కింద సురక్షితంగా ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్  సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్‌లతో సహా బ్యాంకులో మీరు కలిగి ఉన్న దాదాపు అన్ని రకాల డిపాజిట్లను కవర్ చేస్తుంది.

Banking News: మీ బ్యాంక్‌ దివాళా తీస్తే సొమ్ముకు ఎవరు గ్యారెంటీ? నిబంధనలు తెలిస్తే షాకవుతారు..
Bank Account
Follow us
Srinu

|

Updated on: Sep 15, 2023 | 4:30 PM

‍ప్రస్తుత రోజుల్లో డబ్బును అందరూ బ్యాంకుల్లోనే దాచుకుంటున్నారు. బ్యాంకింగ్‌ రంగంపై ప్రజలకు నమ్మకం పెరగడంతో వివిధ రూపాల్లో తమ సొమ్మును పెట్టుబడిగా కూడా పెడుతున్నారు. బ్యాంకులు కూడా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సంబంధిత వడ్డీతో పాటు సొమ్మును వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందిస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి బ్యాంక్ వైఫల్యం అనేది ప్రతి కస్టమర్‌కు భయం కలిగిస్తూ ఉంటుంది. అయితే బ్యాంకుల్లో మీ డిపాజిట్ల భద్రత గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించిరా? అలాంటి ఆలోచనలు వస్తే సింపుల్‌ మర్చిపోతే మంచింది. ఎందుకంటే మన డబ్బులో ఎక్కువ భాగం ఆర్‌బీఐ అనుబంధ సంస్థ అయిన డీఐసీజీసీ కింద సురక్షితంగా ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్  సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్‌లతో సహా బ్యాంకులో మీరు కలిగి ఉన్న దాదాపు అన్ని రకాల డిపాజిట్లను కవర్ చేస్తుంది. అయితే ఇందులో కొన్ని డిపాజిట్లు ఈ పరిధిలోకి రావు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

డీఐసీజీసీ పరిధిలోకి రాని డిపాజిట్లు

  • విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు
  • కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు
  • ఇంటర్-బ్యాంక్ లావాదేవీల నుండి డిపాజిట్లు
  • సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు
  • భారతదేశం వెలుపల పనిచేస్తున్న బ్యాంకులలో డిపాజిట్లు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకారం డీఐసీజీసీ అసలు, వడ్డీకి గరిష్ట మొత్తం రూ. 5 లక్షల వరకు బీమా చేస్తుంది. మీకు వేర్వేరు బ్యాంకుల్లో బ్యాంకు ఖాతాలు ఉంటే బీమా పరిమితి ఒక్కో ఖాతాకు విడిగా వర్తిస్తుంది. అంటే ప్రతి బ్యాంకులో మీ వద్ద ఉన్న డబ్బు రూ. 5 లక్షల పరిమితి వరకు బీమా వర్తిస్తుంది.

బీమా వర్తింపు ఇలా

విఫలమైన బ్యాంకుల డిపాజిటర్లతో డీఐసీజీసీ నేరుగా సంభాషించదు. బ్యాంక్ సమస్యలో ఉన్నప్పుడు, మూసివేయాల్సి వచ్చినప్పుడు బ్యాంక్ మూసివేతను నిర్వహించడానికి బాధ్యత వహించే వ్యక్తి అన్ని డిపాజిటర్ల జాబితాను, వారు బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తాన్ని తయారు చేస్తారు. ఈ జాబితా సమీక్ష, చెల్లింపు కోసం డీఐసీజీసీకు పంపుతారు. డీఐసీజీసీ బ్యాంకుకు డబ్బును ఇస్తుంది. దానిని డిపాజిటర్లకు పంపిణీ చేయడం బ్యాంక్ బాధ్యత.

ఇవి కూడా చదవండి

బ్యాంకుల బీమా ఉందో? లేదో? చెక్‌ చేయడం ఇలా

డీఐసీజీసీ బ్యాంకులను బీమా బ్యాంకులుగా నమోదు చేస్తున్నప్పుడు ముద్రించిన కరపత్రాలను అందిస్తుంది. ఆ బ్యాంకుల డిపాజిటర్లకు డీఐసీజీసీ అందించే రక్షణకు సంబంధించిన సమాచారం కరపత్రాలలో ఉంటుంది. డిపాజిటర్ డీఐసీజీసీ రిజిస్టర్డ్ బ్యాంక్‌గా బ్యాంక్ స్థితిని తెలుసుకోవాలనుకుంటే వారు ఈ విషయంలో బ్రాంచ్ అధికారిని అడిగి తెలుసుకోవచ్చు.

చిన్న డిపాజిట్లకే మేలా?

చిన్న డిపాజిటర్లు సాధారణంగా బ్యాంకు సంక్షోభం విషయంలో తమ డిపాజిట్లను తిరిగి పొందుతారు. అయితే ఇటీవలి సహకార బ్యాంకు సంక్షోభంలో గమనించినట్లుగా ఆలస్యాలు కస్టమర్లకు గణనీయమైన చికాకును కలిగిస్తాయి. మరోవైపు పెద్ద డిపాజిటర్లు (డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అందించిన పరిమితికి మించి డిపాజిట్ బ్యాలెన్స్‌లను కలిగి ఉన్న కస్టమర్‌లు) పునర్నిర్మాణ దృష్టాంతంలో వారికి వర్తించే వారి డిపాజిట్ ఎంత మేరకు కట్ చేశారో? చూడటానికి ప్రక్రియ కోసం వేచి ఉండాలి. ఇది సందర్భానికి అనుగుణంగా మారే అవకాశం ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి