Gold Carats: బంగారంలో ఎన్ని రకాల క్యారెట్లు ఉంటాయి..? వాటి మధ్య తేడా ఏమిటి..?

Gold Carats: దేశీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఏడాది పొడవునా పసిడి కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారం జోరుగా..

Gold Carats: బంగారంలో ఎన్ని రకాల క్యారెట్లు ఉంటాయి..? వాటి మధ్య తేడా ఏమిటి..?
Gold Carats
Follow us

|

Updated on: Nov 04, 2022 | 11:36 AM

Gold Carats: దేశీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఏడాది పొడవునా పసిడి కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. అయితే బంగారాన్ని క్యారెట్లలో లెక్కిస్తారు. అసలు క్యారెట్లు అంటే ఏమిటి..? వాటి మధ్య తేడాలు ఏమిటనే విషయం చాలా మందికి తెలియవు. బంగారం స్వచ్ఛతను బట్టి క్యారెట్లుగా నిర్ణయిస్తారు. ఇక పసిడిని స్వచ్ఛతను బట్టి క్యారెట్లుగా లెక్కిస్తారు. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా గుర్తిస్తారు. ఇందులో గోల్డ్‌ కాయిన్స్‌, గోల్డ్ బార్స్‌, బిస్కెట్ల రూపంలో లభిస్తాయి. అభరణాలు తయారు చేసేందుకు వ్యాపారులు 22 క్యారెట్లను వినియోగిస్తారు. అదే 24 క్యారెట్‌ బంగారం అభరణాలు తయారు చేయాలంటే అందులో ఇతర మెటల్స్‌ని కలుపాల్సి ఉంటుంది. అందుకే అభరణాలు 22 క్యారెట్‌తో ఉంటాయి. ఇక 22 క్యారెట్‌ జ్యువెలరీ మాత్రమే కాదు.. 18 క్యారెట్‌ నగలు కూడా ఉంటాయి. ఇందులో బంగారం స్వచ్ఛత తక్కువనే చెప్పాలి. 18 క్యారెట్‌ నగలనే 22 క్యారెట్‌ అని నమ్మించి మోసం చేసే అవకాశాలు చాలా మందే ఉంటారు. అందుకు అభరణాలు తయారు చేయించినా.. కొనుగోలు చేసినా జాగ్రత్తగా ఉండాలి. బంగారంపై అవగాహన ఉండాలి. అంతేకాకుండా మనం కొనుగోలు చేసే అభరణాలపై హాల్‌మార్కింగ్‌ ముద్రను తప్పతకుండా గమనించాలి. ఈ మధ్య కాలం నుంచి అభరణాలపై హాల్‌ మార్కింగ్‌ అనేది తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం.

22 క్యారెట్లు.. 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి..?

బంగారంలో 22 క్యారెట్లు, 24 క్యారెట్లలో తేడాలు ఉంటాయని గుర్తించుకోవాలి. ఈ తేడాలు బంగారంపై మంచి అవగాహన ఉన్నవారు మాత్రమే గుర్తిస్తారు. ఈ రెండింటికి తేడాలు ఏమిటో బంగారం కొనుగోలు చేసేవారికి ఎక్కువగా తెలుస్తుంటుంది. చాలా మందికి క్యారెట్ల విషయాలలో అన్నో అనుమానాలుంటాయి. క్యారెట్‌ విలువ పెరిగే కొద్ది బంగారం స్వచ్ఛత పెరుగుతుందని గుర్తించుకోవాలి. బంగారం స్వచ్ఛతను 0 నుంచి 24 వరకు లెక్కిస్తారు. అయితే బంగారం ఎంతో సున్నితమైనది. దీనికి రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలిస్తే తప్ప ఆభరణాలు చేయడం సాధ్యపడుతుంది. బంగారం, ఇతర లోహాల మిశ్రమాలు ఏ మోతాదులో కలిశాయనేది కూడా క్యారెట్‌ తెలుపుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి