Whatsapp New Feature: త్వరలోనే వాట్సాప్ డయలర్ హబ్ ఫీచర్! ఇకపై ఆ సమస్య ఉండదు!
ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ తీసుకొస్తూ యూజర్లకు బెటర్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా డయలర్ హబ్ అనే ఫీచర్ తీసుకొస్తుంది. యూజర్లు ఇకపై వేర్వేరు స్క్రీన్‌లకు నావిగేట్ చేయకుండా ఒకేచోట కాల్స్ చేయొచ్చు. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 3.5 బిలియన్లకుపైగా యూజర్లు ఉన్నారు. ఇందులో మేసేజింగ్, ఫొటోలు, వీడియోలు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా డయలర్ హబ్ రాబోతోంది. ఇది నెంబర్ సేవ్ చేసుకోకుండా కాల్స్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. వాట్సాప్ యాప్ లోనే కాల్స్ కోసం కొత్త ట్యాబ్ అందుబాటులోకి రానుంది. ఇది డైరెక్ట్ గా ఫోన్ డయలర్ ఇంటర్‌ఫేస్‌కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడి నుంచే యూజర్లు నేరుగా కాల్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫీఛర్ ద్వారా మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డయలర్ హబ్ ఇంటర్‌ఫేస్
సాధారణంగా కొత్త వ్యక్తులకు ఫోన్ చేయాల్సిన వచ్చినప్పుడు ప్రతిసారీ కాంటాక్ట్ నంబర్‌ను సేవ్ చేయాల్సి ఉంటుంది. దీంతో కాంటాక్ట్స్ లిస్ట్ పెరిగిపోతుంది. అయితే వాట్సాప్ తీసుకువస్తున్న కొత్త అప్‌డేట్‌తో ఇకపై ఎవరికైనా కాల్ చేయడానికి చాట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే నంబర్ కూడా సేవ్ చేయాల్సిన పని లేదు. వాట్సా్ప్ లో అందుబాటులోకి వచ్చే కొత్త డయలర్ హబ్ ఇంటర్‌ఫేస్‌తో డైరెక్ట్‌గా వాట్సాప్ నుంచి ఫోన్ లోని డయలర్‌కు కనెక్ట్ అవ్వొచ్చు.
కాల్ షెడ్యూల్స్
ఇకపోతే ఈ కొత్త ఫీచర్ సాయంతో కాల్స్ షెడ్యూల్ పెట్టొచ్చు. అలాగే కొత్త డయలర్ ఇంటర్‌ఫేస్‌లో నెంబర్ టైప్ చేసి కూడా కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయడం కోసం యూజర్లు మొదట కాల్స్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కుడివైపున పైన పస్ల్ గుర్తుపై నొక్కితే న్యూ కాల్ లింక్, కాల్ ఏ నంబర్, న్యూ కాంటాక్ట్, షెడ్యూల్ కాల్స్ ఆప్షన్ కనిపిస్తాయి. ఇందులో కాల్ ఏ నంబర్‌పై క్లిక్ చేస్తే డయలర్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఏ నంబర్‌కు కాల్ చేయాలనుకున్నారో ఆ నెంబర్ టైప్ చేసి కాల్ చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




