Car Offers: వోక్స్‌వ్యాగన్ కార్లపై ఆఫర్ల వరద.. ఏకంగా రూ.2.7 లక్షల వరకు తగ్గింపు
సొంత కారు అనేది ప్రతి ఒక్కరికి ఓ ఎమోషన్. అయితే కారు కొనుగోలు చేయడం అనేది సామాన్య విషయం కాదు. కారు కొనుగోలు చేయడానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. అందువల్ల చాలా మంది కొత్త కారు కొనుగోలు చేసే ముందు మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రీమియం కార్లకు ప్రసిద్ధి వోక్స్‌వ్యాగన్ జూన్-2025లో నమ్మలేని ఆఫర్లను ప్రకటించింది. కొన్ని మోడల్ కార్లపై ఏకంగా రూ.2.7 లక్షల తగ్గింపు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వోక్స్‌వ్యాగన్ కార్లపై అందుబాటులో ఉన్న ఆఫర్లపై ఓ లుక్కేద్దాం.

వోక్స్ వ్యాగన్ ఇండియా జూన్-2025 కోసం దాని ప్రసిద్ధ మోడళ్లు టైగన్, వర్టస్‌లపై పరిమిత కాల ఆఫర్లను ప్రకటించింది. ఈ డీల్స్ స్పోర్ట్, క్రోమ్ ఎడిషన్లలో విస్తరించి ఉన్నాయి. ఈ తాజా ఆఫర్ల ద్వారా రూ. 2.70 లక్షల లాభం పొందవచ్చు. వోక్స్ వ్యాగన్ వర్టస్ జీటీ లైన్ 1.0 లీటర్ టీఎస్ఐ ఏటీ కారుపై కొనుగోలుదారులు రూ.1.15 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. జీటీ ప్లస్ స్పోర్ట్ 1.5 లీటర్ టీఎస్ఐ డీఎస్‌జీపై రూ.1.20 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది.
క్రోమ్ లైనప్‌పై మరింత లాభదాయకమైన డీల్స్‌ను అందిస్తుంది. హైలైన్ 1.0 లీటర్ టీఎస్ఐ ఏటీపై రూ.2.15 లక్షల వరకు, టాప్ ఎండ్ 1.0 లీటర్ టీఎస్ఐ ఎంటీపై రూ.2.20 లక్షల వరకు, జీటీ ప్లస్ క్రోమ్ 1.5 లీటర్ టీఎస్ఐ డీఎస్‌జీపై రూ.1.55 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. వోక్స్‌వ్యాగన్ వర్టస్ ధరలు ఇప్పుడు ఆఫర్ ధర రూ.10.54 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది. వోక్స్వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీపై డిస్కౌంట్లను అందిస్తోంది. జీటీ లైన్ 1.0 లీటర్ టీఎస్ఐ ఏటీపై రూ.1.15 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే జీటీ ప్లస్ స్పోర్ట్ 1.5 లీటర్ టీఎస్ఐ డీఎస్‌జీపై రూ.1.85 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది. క్రోమ్ ఎడిషన్‌లో కొనుగోలుదారులు హైలైన్ 1.0 లీటర్ టీఎస్ఐ ఏటీపై రూ.1.40 లక్షల వరకు, టాప్‌లైన్ 1.0 లీటర్ టీఎస్ఐ ఏటీపై రూ.2.20 లక్షల వరకు, జీటీ ప్లస్ క్రోమ్ 1.5 లీటర్ టీఎస్ఐ డీఎస్‌జీపై రూ.2.70 లక్షల వరకు ఆదా చేయవచ్చు. టైగన్ ఆఫర్ ధర రూ.10.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
అలాగే వినియోగదారులు రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ నుంచి చెల్లుబాటు అయ్యే డిపాజిట్ సర్టిఫికేట్ (సీడీ)ని సమర్పించడం ద్వారా కస్టమర్లు రూ.20,000 వరకు స్క్రాపేజ్ ప్రయోజనాలను పొందవచ్చని వోక్స్‌వ్యాగన్ ప్రకటించింది. కొనుగోలుదారులు భారత ప్రభుత్వ విధానాలకు లోబడి రిజిస్ట్రేషన్ పన్ను రాయితీను పొందవచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








