Vehicle Number Plate: నంబర్ ప్లేట్ల రంగుల రహస్యం.. తెలుపు, పసుపు, ఆకుపచ్చ నంబర్ల అర్థం ఏంటో తెలుసా..?
ఈ వాహనాల నంబర్ ప్లేట్లు వేర్వేరు రంగులలో ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ రంగుల వెనుక వేర్వేరు కారణాలు ఉన్నాయి. వాటి అర్థం మీకు తెలిస్తే, ఏ వాహనం ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తే గమనించవచ్చు. అలాగే ఎన్ని రకాల నంబర్ ప్లేట్లు ఉన్నాయో ? వాటి అర్థం ఏంటో తెలుసుకుందాం.

మీరు రోడ్లపైకి వెళ్ళినప్పుడల్లా అనేక రంగుల నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను చూస్తుంటారు. కొన్నిసార్లు తెలుపు, కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు ఆకుపచ్చ. కానీ ఈ వాహనాల నంబర్ ప్లేట్లు వేర్వేరు రంగులలో ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ రంగుల వెనుక వేర్వేరు కారణాలు ఉన్నాయి. వాటి అర్థం మీకు తెలిస్తే, ఏ వాహనం ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తే గమనించవచ్చు. అలాగే ఎన్ని రకాల నంబర్ ప్లేట్లు ఉన్నాయో ? వాటి అర్థం ఏంటో తెలుసుకుందాం.
- తెలుపు: రోడ్లపై ఎక్కువగా కనిపించే వాహనాలలో తెల్లటి నంబర్ ప్లేట్ ఉన్నవి. ఇవి ప్రైవేట్ వాహనాలు. వాటి నంబర్ ప్లేట్లు తెల్లగా ఉంటాయి. మీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తే, అందులో తెల్లటి నంబర్ ప్లేట్ మాత్రమే ఉపయోగిస్తారు.
- పసుపు: వాణిజ్య వాహనాలకు పసుపు రంగు నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తారు. ఇందులో టాక్సీలు, బస్సులు, ట్రక్కులు మొదలైనవి ఉన్నాయి. క్యాబ్ నంబర్ ప్లేట్ పసుపు రంగులో ఉండటం మీరు తరచుగా గమనించి ఉండవచ్చు. ఈ వాహనాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అందుకే వాటి నంబర్ ప్లేట్లు పసుపు రంగులో ఉంటాయి.
- ఆకుపచ్చ: నేడు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అటువంటి పరిస్థితిలో వాహనం నంబర్ ప్లేట్ ఆకుపచ్చగా ఉంటే, అది ఎలక్ట్రిక్ వాహనం అని అర్థం చేసుకోండి.
- ఎరుపు: ఎరుపు రంగు నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇటువంటి ప్లేట్లను భారత రాష్ట్రపతి, గవర్నర్ వాహనాలపై ఏర్పాటు చేస్తారు. ఈ నంబర్ ప్లేట్లపై సంఖ్యలకు బదులుగా అశోక చిహ్నం ఉంటుంది. ఇది కాకుండా కంపెనీలు పరీక్షా ప్రయోజనాల కోసం రోడ్డుపైకి తీసుకువచ్చే వాహనాలపై కూడా ఎరుపు నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేస్తారు. అయితే ఇది తాత్కాలికమే.
- నీలం: మీరు నీలిరంగు నంబర్ ప్లేట్ ఉన్న కారును చూసినప్పుడల్లా అది ఒక దౌత్యవేత్త కారు అని అర్థం చేసుకోండి. నీలం నంబర్ ప్లేట్లను విదేశీ ప్రతినిధులు మాత్రమే ఉపయోగిస్తారు.
- నలుపు: అద్దెకు ఇచ్చే వాణిజ్య వాహనాలపై నల్లటి నంబర్ ప్లేట్లు అమర్చబడి ఉంటాయి. అద్దె కార్లకు పసుపు రంగులో నంబర్ రాసిన నల్ల నంబర్ ప్లేట్లు ఉంటాయి. అందుకే ఇప్పుడు మీరు వేర్వేరు రంగుల నంబర్ ప్లేట్‌ను చూసినప్పుడల్లా, అది ఏ వాహనానికి చెందినదో, దానిని ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారో మీకు అర్థమవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




