గుడ్‌న్యూస్.. విజయవాడ టూ బెంగళూరు వయా తిరుపతి రూట్‌లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్! ప్రారంభ తేదీ, టైమ్ టేబుల్ ఇదే!
రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా తిరుపతి భక్తులకు శుభవార్త. విజయవాడ-తిరుపతి-బెంగళూరు మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరగడంతో మరిన్ని కొత్త రైళ్లతో పాటు స్లీపర్ రైళ్లు కూడా రానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రైల్వే ప్రయాణికులకు ముఖ్యంగా తిరుమల తిరుపతి భక్తులకు శుభవార్త. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనుంచి దక్షిణ మధ్య రైల్వే. వచ్చే నెల అంటే డిసెంబర్ 10న ఈ కొత్త ట్రైన్ ప్రారంభించే అవకాశం ఉంది. విజయవాడ నుండి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు బెంగళూరుకు చేరుకునే టైమ్‌టేబుల్‌తో ఈ కొత్త వందే భారత్ నడవనుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లకు మంచి డిమాండ్ ఏర్పడటంతో ఇండియన్ రైల్వేస్ మరికొన్ని కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తోంది. అలాగే త్వరలోనే వందే భారత్ స్పీపర్ ట్రైన్లు కూడా పట్టాలు ఎక్కనున్నాయ. ఇప్పటికే టెస్ట్ రన్ కూడా పూర్తి అయింది. టెస్ట్ రన్‌లో చిన్న చిన్న సమస్యలు గుర్తించగా వాటిని పరిష్కరించి జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా నవంబర్ 26 నుండి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు సామర్థ్యాన్ని పెంచడానికి 18 AC చైర్ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లకు పెంచనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
