UPI LITE: నెట్ లేకపోయినా అమౌంట్ ట్రాన్స్ఫర్..యూపీఐ లైట్ తో ఆ సమస్యకు చెక్

సమస్యలకు చెక్ పెట్టడానికి సరికొత్తగా యూపీఐ లైట్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా నెట్ లేకపోయినా రూ.200 లోపు ఎమౌంట్ ను ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. 

UPI LITE: నెట్ లేకపోయినా అమౌంట్ ట్రాన్స్ఫర్..యూపీఐ లైట్ తో ఆ సమస్యకు చెక్
Upi Payments
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 25, 2022 | 4:19 PM

ప్రస్తుతం అంతా డిజిటల్ మేనియా నడుస్తుంది. గతంలో డబ్బు ట్రాన్స్ ఫర్ చేయాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ పీసీఐ ద్వారా చేపట్టే యూపీఐ లావాదేవీలు దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో అంతా ఎక్కడకెళ్లినా తమ మొబైల్లో క్యూఆర్ కోడ్ స్కానర్ తో తమ చెల్లింపులను నిరాటంకంగా చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారిని వేధించే సమస్య నెట్ వర్క్ ఇష్యూ. మన ఫోన్స్ లో నెట్ వర్క్ ఇష్యూ లేదంటే బ్యాంక్ సర్వర్ డౌన్ కారణంగా మనం యూపీఐ పేమెంట్ సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటాం. అయితే ఈ సమస్య మన షాపింగ్ లో ఎదురైతే పర్లేదు..హోటల్లో తిన్న తర్వాత పేమెంట్ జరగకపోతే అప్పుడు పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి సరికొత్తగా యూపీఐ లైట్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా నెట్ లేకపోయినా రూ.200 లోపు ఎమౌంట్ ను ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. 

యూపీఐ లైట్ ఎలా సెట్ చేసుకోవాలి

  • ప్లే స్టోర్ లోకి వెళ్లి బీమ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి.
  • యాప్ లో సైన్ ఇన్ అయ్యాక, మీ బ్యాంక్ ఖాతా లింక్ చేసుకోవాలి.
  • యాప్ ను కిందకు స్క్రోల్ చేసి యూపీఐ లైట్ ను ఎంచుకోవాలి. 
  • సమాచారాన్ని సరిచూసుకుని స్టార్ట్ నౌ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
  • ఇప్పడు యూపీఐ లైట్ ఈ వ్యాలెట్ లో రూ.2000 వరకూ డిపాజిట్ చేసుకోవచ్చు. 
  • బ్యాంక్ ఖాతను సెలెక్ట్ చేసుకుని వ్యాలెట్ లో ఎమౌంట్ ట్రాన్స్ ఫర్ చేయాలి.
  • అనంతరం ఎనేబుల్ యూపీఐ లైట్ ను ఎంపిక చేయాలి. 
  • అనంతరం యూపీఐ పిన్ ను ఎంటర్ చేస్తే యూపీఐ లైట్ యాక్టివేట్ అవుతుంది. 

యూపీఐ ఎలా పని చేస్తుంది? 

యూపీఐ లైట్‌లో వర్చువల్ బ్యాలెన్స్ ఉంది. ఇది ఎన్‌పీసీఐకి కాకుండా, జారీ చేసే బ్యాంకు ద్వారా మాత్రమే పని చేస్తుంది. యూపీఐ లైట్ బ్యాలెన్స్‌పై వడ్డీ చెల్లించరు. యూపీఐ లైట్ చెల్లింపు వ్యవస్థ ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్, కెనరా, హెచ్ డీఎఫ్ సీ, కోటక్ మహీంద్రా, ఇండియన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారులకు మాత్రమే అందుబాటలో ఉంది. యూపీఐ లావాదేవీలను  ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే చెల్లింపులు  చేయవచ్చు. కానీ రిసీవర్ ఖాతాలోకి క్రెడిట్‌లు ఆన్‌లైన్‌లో చేస్తారు. అయితే, యూపీఐ లైట్‌ని పూర్తిగా ఆఫ్‌లైన్‌గా మార్చే భవిష్యత్తు ప్రణాళిక ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసే వారికి అలెర్ట్..!
ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసే వారికి అలెర్ట్..!
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల కేసులో సంచలనం.. హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల కేసులో సంచలనం.. హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్
ఐపీఎల్ వివాదంపై స్పందించిన అనిల్ రావిపూడి..
ఐపీఎల్ వివాదంపై స్పందించిన అనిల్ రావిపూడి..
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..