UPI Payment: యూపీఐ పేమెంట్స్‌ చేసే వారికి గుడ్‌ న్యూస్‌.. వాయిస్‌ కమాండ్స్‌తో సేవలు పొందే అవకాశం..

UPI Payment: పేమెంట్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు లావాదేవీల తీరు పూర్తిగా మారిపోయింది. ఒక్క క్లిక్‌తో ఒకరి నుంచి మరొకరికి డబ్బులు సింపుల్‌గా పంపించుకుంటున్నారు. అయితే ప్రారంభంలో యూపీఐ సేవలు కేవలం...

UPI Payment: యూపీఐ పేమెంట్స్‌ చేసే వారికి గుడ్‌ న్యూస్‌.. వాయిస్‌ కమాండ్స్‌తో సేవలు పొందే అవకాశం..
Upi Voice Payment
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 11, 2022 | 3:37 PM

UPI Payment: పేమెంట్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు లావాదేవీల తీరు పూర్తిగా మారిపోయింది. ఒక్క క్లిక్‌తో ఒకరి నుంచి మరొకరికి డబ్బులు సింపుల్‌గా పంపించుకుంటున్నారు. అయితే ప్రారంభంలో యూపీఐ సేవలు కేవలం స్మార్ట్‌ఫోన్‌లో ఉండే పేమెంట్‌ యాప్స్‌ ద్వారా మాత్రమే చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఆ తర్వాత ఫీచర్‌ ఫోన్‌ యూజర్లకు కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫీచర్‌ ఫోన్‌ను ఉపయోగించే వారు కూడా చిన్న చిన్న కమాండ్స్‌తో యూపీఐ సేవలను పొందుతూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఫీచర్‌ ఫోన్‌ యూజర్ల కోసం యూపీఐ పేమెంట్స్‌లో మరో అద్భుత ఫీచర్‌ను తీసుకొచ్చారు. యూజర్లు నచ్చిన భాషలో మాట్లాడడం ద్వారా యూపీఐ సేవలను పొందొచ్చు. దీనికోసం టోన్‌ ట్యాగ్ అనే సంస్థ కొత్త సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో టోన్ ట్యాగ్ సంస్థ దేశంలోని పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులతో కలిసి యూపీఐ 123 పే పేరుతో సేవ‌ల‌ను ప్రారంభించింది. ప్రస్తుతం టోన్‌ట్యాగ్‌ ఫ‌స్ట్ వాయిస్‌ సొల్యూష‌న్‌తో ఈ సేవ‌ల‌ను మ‌రింత‌ విస్తరించ‌నున్నట్లు తెలిపింది.

ఈ కొత్త ఫీచర్‌తో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లో యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. అనంతరం గుజరాతీ, మరాఠీ, పంజాబీలో సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం యూజర్లు 6366 200 200 ఐవీఆర్ నంబ‌ర్‌కు కాల్ చేసి వారికి నచ్చిన భాష లేక ప్రాంతీయ భాష‌ను ఎంపిక చేసుకుని యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చని వివరించింది. అయితే ఈ సేవలు ప్రస్తుతం కేవలం యుటిలిటీ బిల్లు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ లేదా రీఛార్జ్ వంటి మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ