UPI Payments: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ లిమిట్ భారీగా పెంపు.. ఇక టెన్షన్ ఎందుకు దండగ!

|

Dec 13, 2023 | 12:14 PM

మీరు ఒకవేళ యూపీఐలో ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ వినియోగిస్తూ ఉంటే.. ఇది మీకు ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ ఆటోమేటిక్ పేమెంట్ పరిమితి కేవలం రూ. 15,000 మాత్రమే ఉంది. అంటే సింగిల్ లావాదేవీ మీరు రూ. 15,000 వరకూ మాత్రమే చేసుకోగలరు. అయితే ఇప్పుడు ఆ పరిమితిని రూ. 1లక్షకు పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

UPI Payments: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ లిమిట్ భారీగా పెంపు.. ఇక టెన్షన్ ఎందుకు దండగ!
UPI Payments
Follow us on

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ) రాకతో బ్యాంకింగ్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. డిజిటల్ బాటలో దూసుకుపోతోంది. ఇదివరకటి లాగా.. ప్రతి దానికి బ్యాంకులకు వెళ్లే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఏదైనా పెద్ద సమస్య లేదా మరీ భారీ మొత్తంలో కనుక లావాదేవీలు చేయాల్సి వస్తే తప్ప బ్యాంకు ముఖం ఎవరూ పెద్దగా చూసే పరిస్థితి లేదు. డబ్బులు వేయాలన్నా.. తీయాలన్నా.. ఏదైనా వస్తువు కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఇంట్లో కరెంట్ బిల్లులు, ఫోన్ బిల్లులు, కేబుల్ బిల్లులు వంటివి కట్టాలన్నా అన్నీ యూపీఐ ద్వారా శరవేగంగా సెకండ్ల వ్యవధిలో పూర్తయిపోతున్నాయి. దీంతో వినియోగదారులు చాలా సౌకర్యం కలుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్ల ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని సాయంతో ప్రతి నెలా మీరు చెల్లించే బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐ చెల్లింపులు, ఓటీటీ సబ్ స్క్రిప్షన్, బీమా, మ్యూచువల్ ఫండ్స్ వంటివి అన్ని వాటంతట అవే చెల్లింపులు చేసేలా సెట్ చేసుకోవచ్చు. యూపీఐలో ఈ ఆటోపే ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే దీని సాయంతో ఇప్పటి వరకూ రూ. 15,000 వరకూ సింగిల్ లావాదేవీ జరుపుకునే వీలుంది. అయితే ఈ పరిమితిని ఆర్బీఐ పెంచింది. రూ. 15,000 నుంచి ఏకంగా రూ. 1లక్షకు ఈ పరిమితిని పెంచింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత వారం ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన సర్కులర్ మంగళవారం వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

భారీగా పెరిగిన డిజిటల్ పేమెంట్లు..

మన దేశంలో డిజిటల్ పేమెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ ఆధారిత లావాదేవీలు అత్యంత జనాదరణ పొందుతున్నాయి. వీధి చివర చిరు వ్యాపారి నుంచి, టీ స్టాల్స్, పాన్ షాపు, రెస్టారెంట్, షాపింగ్ మాల్స్, హోటల్స్ ఇలా ఎక్కడికి వెళ్లినా యూపీఐ ఆధారిత సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ ఏడాది నవంబర్లో దాదాపు 11.23 బిలియన్ల లావాదేవీలు జరిగినట్లు ఆర్బీఐ ప్రకటించింది. ప్రజల్లో పెరుగుతున్న ఈ డిమాండ్ ను అనుగుణంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కీలక ప్రకటన చేసింది. మీరు ఒకవేళ యూపీఐలో ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ వినియోగిస్తూ ఉంటే.. ఇది మీకు ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ ఆటోమేటిక్ పేమెంట్ పరిమితి కేవలం రూ. 15,000 మాత్రమే ఉంది. అంటే సింగిల్ పేమెంట్ మీరు రూ. 15,000 వరకూ మాత్రమే చేసుకోగలరు. అయితే ఇప్పుడు ఆ పరిమితిని రూ. 1లక్షకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

ఎవరికి ప్రయోజనం..

యూపీఐ ఆధారిత ఆటోమేటిక్ చెల్లింపులు ఆప్షన్ ఎంచుకున్న ప్రతి ఒక్కరికీ దీని ద్వారా మేలు చేకూరనుంది. అన్ని వర్గాల వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ చెల్లింపులు, కార్డులు, ప్రీ పెయిడ్ చెల్లింపులు యూపీఐ ద్వారా చేస్తున్నప్పుడు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్(ఏఎఫ్ఐ)లో ఈ పరిమితి సడలింపు మీకు కనిపిస్తుంది. దీని ద్వారా మీరు రూ. 15,000 నుంచి రూ. 1,00,000 వరకూ ఎంతైనా సింగిల్ లావాదేవీలోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ తో వినియోగదారులు ఇప్పుడు మొబైల్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, ఈఎంఐ చెల్లింపులు, ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు, బీమా చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్స్ చెల్లింపులు ఇలా అనేక రకాల నెలవారీ చెల్లిపు కోసం యూపీఐ ద్వారా చెల్లింపును సులభంగా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..