Aadhaar Card Fraud: మీ ఆధార్‌తో ఎవరో బ్యాంకు ఖాతా తెరిచారా? దానికి బాధ్యులు ఎవరు..?
దేశవ్యాప్తంగా వ్యక్తిగత గుర్తింపు లేదా చిరునామా రుజువు కోసం అత్యంత విస్తృతంగా ఉపయోగించే ప్రభుత్వ పత్రంగా ఆధార్ మారింది. ఆధార్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండడంతో ఎక్కువ మంది మోసగాళ్ల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ మోసగాళ్లు ఆధార్ కార్డు వివరాలను దొంగిలించి ప్రయోజనాలను పొందేందుకు ఆధారాలను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
ప్రస్తుత రోజుల్లో ఆధార్ అనేది ప్రతి చిన్న అవసరానికి ఆధారంగా మారతుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుతో పాటు బ్యాంకింగ్ రంగ విషయాలకు కూడా ఆధార్ తప్పనిసరైంది. ఆధార్ అంటే కేంద్ర ప్రభుత్వం పౌరుల గుర్తింపునకు భారత విశిష్ట గుర్తింపు అథారిటీ జారీ చేసిన 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. దేశవ్యాప్తంగా వ్యక్తిగత గుర్తింపు లేదా చిరునామా రుజువు కోసం అత్యంత విస్తృతంగా ఉపయోగించే ప్రభుత్వ పత్రంగా ఆధార్ మారింది. ఆధార్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండడంతో ఎక్కువ మంది మోసగాళ్ల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ మోసగాళ్లు ఆధార్ కార్డు వివరాలను దొంగిలించి ప్రయోజనాలను పొందేందుకు ఆధారాలను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించవచ్చు. ఒకవేళ మోసగాళ్లు మనకు తెలియకుండా మన ఆధార్‌తో బ్యాంకు ఖాతా తెరిస్తే ఏమవుతుంది? ఎవరికి ఫిర్యాదు చేయాలి? లాంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
పీఎంఎల్ నియమాల ప్రకారం బ్యాంక్ ఖాతాను తెరవడానికి ఆమోదించిన అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రాలలో ఆధార్ ఒకటి. అలాగే బ్యాంకింగ్ లావాదేవీలు లేదా కేవైసీ కోసం బ్యాంక్ ఇతర శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఒక మోసగాడు ఆధార్‌ని ఉపయోగించి బ్యాంక్ ఖాతాను తెరవడానికి ప్రయత్నిస్తే బ్యాంక్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అలాంటి సందర్భంలో బ్యాంకు చేసిన తప్పుకు ఆధార్ హోల్డర్ బాధ్యత వహించలేరని యూఐడీఏఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో అధికారికంగా తెలిపింది. అయితే అనధికారికంగా ఖాతా తెరవడం వల్ల ఇప్పటి వరకు ఏ ఆధార్ హోల్డర్‌కు ఆర్థిక నష్టం జరగలేదని పేర్కొంది.
ఆధార్ కార్డ్ అప్‌డేట్ గడువు పొడగింపు
తాజాగా ప్రభుత్వం ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ గడువును మూడు నెలలు పొడిగించింది. దీనితో, ప్రజలు ఇప్పుడు తమ ఆధార్ కార్డ్‌ని మార్చి 14, 2024 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అంతకుముందు, ఉచిత UID అప్‌డేట్ కోసం గడువు డిసెంబర్ 14 పేర్కొంది. మై ఆధార్ పోర్టల్‌లో ఈ సేవ ఉచితంగా పొందవచ్చు. అయితే నియమించిన ఆధార్ కార్డ్ అప్‌డేట్ సెంటర్‌లలో మాత్రం యూఐడీ అప్‌డేట్ కోసం రూ. 50 రుసుము చెల్లించాలి.
ఉచిత ఆధార్ కార్డు అప్‌డేట్ ఇలా
- ఉచిత సేవను యాక్సెస్ చేయడానికి, ఆధార్ నంబర్‌ని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి .
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది.
- ఇప్పుడు, ‘డాక్యుమెంట్ అప్‌డేట్’ ఎంపికకు వెళ్లి, వివరాలను ధ్రువీకరించి, సమాచారాన్ని మళ్లీ ధ్రువీకరించడానికి పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
- వ్యక్తులు తమ గుర్తింపు, చిరునామాకు సంబంధించిన పత్రాలను యూఐడీ అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాలి.
యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నెంబర్
ఏదైనా ప్రశ్న లేదా సహాయం విషయంలో యూఐడీఏఐ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1947ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా యూఏడీఏఐ అధికారిక ఈ-మెయిల్ చిరునామా ద్వారా కూడా సంప్రదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..