December 1st: డిసెంబర్ నెలలో ఆర్థిక రంగంలో మారనున్న నిబంధనలు ఇవే.. ఓ లుక్కేయండి..
. 2023 ఏడాదికి చివరి నెల ప్రారంభమైంది. నెల మారడంతో బ్యాంకింగ మొదలు, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో పలు నిబంధనలు మారాయాయి. బ్యాంకింగ్ రంగం భారీగా విస్తరించిన ప్రస్తుత తరుణంలో సహజంగానే ఈ మార్పులు ప్రతీ ఒక్కరిపై ప్రభావం చూపిస్తాయి. అయితే తాజాగా మారిన నిబంధనల మీ ఆర్థిక ఆర్థిక పరిస్థితితో పాటు రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.? ఇప్పుడు తెలుసుకుందాం..
డిసెంబర్ 1వ తేదీ వచ్చేసింది. 2023 ఏడాదికి చివరి నెల ప్రారంభమైంది. నెల మారడంతో బ్యాంకింగ మొదలు, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో పలు నిబంధనలు మారాయాయి. బ్యాంకింగ్ రంగం భారీగా విస్తరించిన ప్రస్తుత తరుణంలో సహజంగానే ఈ మార్పులు ప్రతీ ఒక్కరిపై ప్రభావం చూపిస్తాయి. అయితే తాజాగా మారిన నిబంధనల మీ ఆర్థిక ఆర్థిక పరిస్థితితో పాటు రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.? ఇప్పుడు తెలుసుకుందాం..
మారిన సిమ్ కార్డ్ రూల్..
డిసెంబర్ 1వ తేదీ నుంచి సిమ్ కార్డ్‌ల జారీల విషయంలో మార్పులు జరిగాయి. ఇకపై సిమ్ కార్డ్ డీలర్‌లు తప్పనిసరిగా బల్క్ కనెక్షన్‌లు ఇవ్వడానికి వీలు లేకుండా భారత్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ (డాట్) ఈ కొత్త నిబంధనలను ప్రకటించింది. నిజానికి ఈ నిబంధనలు మొదటగా ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించాలని భావించారు కానీ డిసెంబర్‌కి వాయిదా పడింది.
లాకర్ నిబంధనల్లో మార్పులు..
కస్టమర్‌లు, బ్యాంకుల మధ్య లాకర్ ఒప్పందాల పునరుద్ధరణ గడువు డిసెంబర్‌తో ముగిసిన నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్‌లు, బ్యాంకుల మధ్య లాకర్ ఒప్పందాల పునరుద్దరణ గడువును డిసెంబర్ 31వ తేదీ 2023 వరకు పొడగించింది. అగ్రిమెంట్స్ పునరుద్దరణకు పెద్ద సంఖ్యలో కస్టమర్లు సవరించిన ఒప్పందంపై సంతకం చేయని నేపథ్యంలో గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
యూపీఐ నిబంధనల్లో మార్పులు..
ఇక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. యూపీఐ సేవలు ఉపయోగిస్తున్న వారికి సేవలను తమ బ్యాంకులు యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ నెంబర్ డిసెంబర్ 31 నాటికి డియాక్టివేట్ అవుతాయి. యూపీఐ ఐడీని అన్ని బ్యాంకులు యాక్టివేట్ చేసుకోవాలి. యూపీఐ సౌకర్యాన్ని అందించే థర్డ్ పార్టీ యాప్‌లు డిసెంబర్ 31లోపు అప్‌డేట్ చేయకపోతే, సదరు ఐడీలు డీయాక్టివేట్ అవుతాయి.
ఆధార్ కార్డులో మార్పులు..
మై ఆధార్ పోర్టల్ పోర్టల్‌ద్వారా కార్డ్ హోల్డర్లు తమన ఆధార్ వివరాలను డిసెంబర్ 14వ తేదీ వరకు ఉచితంగా సవరించుకోగలరు. యునిట్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును డిసెంబర్ 14వ తేదీ వరకు పొడగించారు. గతంలో సెప్టెంబర్ 14వ తేదీని చివరి తేదీగా ప్రకటించగా, ఇప్పుడు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
జీవిత ధృవీకరణ పత్రాలు సబ్‌మిట్..
ఇక పెన్షన్లు పొందే వారు.. జీవిత ధృవీకరణ పత్రాలను సబ్‌మిట్ చేయడానికి గడువు నంబర్ 30వ తేదీతోని ముగిసిపోయింది. పెన్షన్లు కొనసాగడానికి ఈ సర్టిఫికేట్లను అందించాల్సి ఉంటుది. అయితే గడువు ముగిసిన తర్వాత కూడా ఈ పత్రాలను సమర్పింవచ్చు.. అయితే మీ లైఫ్ సర్టిఫికేట్ సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్స్‌కి వెళ్లిన తర్వాతే మీ పెన్షన్ పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..