Aadhaar Card: ఆధార్ కార్డ్‌లో డేటాఫ్ బర్త్‌ను ఎన్నిసార్లు మార్చుకోవచ్చు.. నిబంధనలు ఏంటంటే..
ఇదిలా ఉంటే అనివార్యంగా మారిన ఆధార్ కార్డ్‌కు సంబంధించి ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. ఆధార్ కార్డులో ఉన్న వివరాలను మార్చుకోవాలంటే కొన్ని రకాల నిబంధనలను పాటించాల్సిందే. ఇలాంటి వాటిలో పుట్టిన తేదీతో పేరు ముఖ్యమైనవి. అయితే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్‌తో పాటు, పేరును మార్చుకోవడానికి కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఆధార్ కార్డ్ అనివార్యంగా మారింది. ప్రతీ ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డ్ ఇప్పుడు గుర్తింపుకార్డుగా మారింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ నుంచి, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే వరకు ప్రతీ పనికి ఆధార్ కార్డ్ అనివార్యంగా మారింది. కాలేజీలో సీటు మొదలు, లోన్ తీసుకునే వరకు ప్రతీ ఒక్కపనికి ఆధార్ కార్డ్ ఉండాల్సిందే.
ఇదిలా ఉంటే అనివార్యంగా మారిన ఆధార్ కార్డ్‌కు సంబంధించి ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. ఆధార్ కార్డులో ఉన్న వివరాలను మార్చుకోవాలంటే కొన్ని రకాల నిబంధనలను పాటించాల్సిందే. ఇలాంటి వాటిలో పుట్టిన తేదీతో పేరు ముఖ్యమైనవి. అయితే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్‌తో పాటు, పేరును మార్చుకోవడానికి కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధార్ కార్డులో పేరు, డేటాఫ్ బర్త్‌ను ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మార్చుకోవడానికి వీలు లేదు. ఆధార్ కార్డ్ హోల్డర్ తన జీవిత కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే తన పేరును మార్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆధార్ కార్డులో పుట్టిన తేదీని కూడా కేవలం రెండు సార్లు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆధార్ కార్డులో లింగం (జెండర్)ను ఒకేసారి మార్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
పేరు ఎలా మార్చుకోవాలంటే..
ఆధార్ కార్డులో పేరు మార్చుకోవాలంటే ముందుగా యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం ఆధార్ నెంబర్‌తో పాటు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. వెంటనే ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన ర్వా.. ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ప్రోసీడ్‌పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అయిన ర్వా పేరు మార్పు ఆప్షన్‌ను ఎంచుకొని, అవసరమైన డ్యాక్యుమెంట్లను స్కాన్ చేసిన అటాచ్ చేయాలి. ఆ తర్వాత సబ్‌మిట్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మొబైల్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. దీంతో దరఖాస్తు పూర్తి అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..