AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకుంటే ఉచితంగా హెల్త్‌ చెకప్‌.. వీటిలో భారీ డిస్కౌంట్‌..!

Credit Card: ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (UBI) సరికొత్త క్రెడిట్‌ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్..

Credit Card: ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకుంటే ఉచితంగా హెల్త్‌ చెకప్‌.. వీటిలో భారీ డిస్కౌంట్‌..!
Subhash Goud
|

Updated on: Sep 20, 2021 | 6:04 PM

Share

Credit Card: ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (UBI) సరికొత్త క్రెడిట్‌ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)తో చేతులు కలిపిన యూబీఐ.. యూనియన్ బ్యాంక్ రూపే వెల్‌నెస్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకువస్తోంది. కస్టమర్ల లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ కోసం క్రెడిట్ కార్డును వాడటం కోసమే ప్రత్యేకంగా దీనిని రూపొందించారు. ఈ క్రెడిట్ కార్డు ద్వారా వినియోగదారులు తమ ఫిట్‌నెస్, ఆరోగ్యం, పర్సనల్ కేర్, లైఫ్ స్టైల్ మీద దృష్టి పెడతారు. పర్సనల్ కేర్ కోసం ఈ క్రెడిట్ కార్డును వాడి భారీ డిస్కౌంట్‌లను పొందే అవకాశం ఉందని యూబీఐ ఎండీ, సీఈవో రాజ్ కిరణ్ రాయ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు ఫిట్‌గా ఉండాలని అనుకుంటారు.. పర్సనల్ కేర్ మీద దృష్టి పెడతారు. అటువంటి వాళ్ల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్రెడిట్ కార్డు ఇది. వెల్‌నెస్‌ ప్యాకేజ్‌లు చాలా వరకు ఈ కార్డు ద్వారా సేవ్ చేసుకోవచ్చు అని ఎన్పీసీఐ సీవోవో ప్రవీణ రాయ్ పేర్కొన్నారు.

కాంప్లిమెంటరీ జిమ్‌ మెంబర్‌ షిప్‌:

యూనియన్ బ్యాంక్ రూపే వెల్‌నెస్‌ క్రెడిట్ కార్డు ద్వారా, దేశ వ్యాప్తంగా సెలక్ట్ చేసిన జిమ్ సెంటర్లలో.. 15 నుంచి 30 రోజుల వరకు కాంప్లిమెంటరీ జిమ్ మెంబర్ షిప్‌ను క్రెడిట్ కార్డు కస్టమర్లు పొందవచ్చు. ఇప్పటికే ఆయా జిమ్‌లలో మెంబర్స్‌గా ఉన్నవాళ్లకు మెంబర్‌షిప్ రెన్యువల్ సమయంలో 40 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే.. దేశంలోని టాప్ సిటీలలో ఉన్న గోల్ఫ్ కోర్సులలో కూడా ఈ కార్డు ద్వారా యాక్సెస్ ఉంటుంది. ఒక ఏడాదిలోపు ఒక కాంప్లిమెంటరీ గోల్ఫ్ గేమ్ కూడా అందిస్తారు.

హెల్త్ చెకప్ ప్యాకేజ్:

కార్డు వినియోగదారుడికి ఏడాదిలో ఒక కాంప్లిమెంటరీ ప్రీమియం హెల్త్ చెకప్ ప్యాకేజ్ ఉంటుంది. కాంప్లిమెంటరీ ప్యాకేజీని ఒక సంవత్సరంలో ఉపయోగించుకుంటే.. తర్వాత మరోసారి చెకప్‌కు భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. ప్రతి సంవత్సరం కాంప్లిమెంటరీ వెల్‌నెస్‌ ట్రీట్‌మెంట్‌తో పాటు ప్రతి నెలా స్పా సెషన్స్‌కు యాక్సెస్ కూడా ఉంటుంది.

30 డొమెస్టిక్‌ ఎయిర్‌ పోర్టులలో..

కాగా, దేశంలోని 30 డొమెస్టిక్ ఎయిర్ పోర్టుల్లో ఉన్న లాంజ్‌లలో మూడు నెలల్లో రెండు సార్లు కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంటుంది. ఈ కార్డులో ఎన్నో బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్డు ద్వారా డొమెస్టిక్‌గా, అంతర్జాతీయంగా.. భారీ డిస్కౌంట్లతో వెల్‌నెస్‌కు సంబంధించిన సెంటర్లలో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలాంటి బెస్ట్ ఫీచర్లతో ఇప్పటి వరకు ఏ క్రెడిట్ కార్డు రాలేదని జేసీబీ ఇంటర్నేషనల్ కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్ యోషికి కనెకో వెల్లడించారు.

ఇవీ కూడా చదవండి:

Whatsapp: మీ మొబైల్‌లో సేవ్‌కాని నంబర్లకు వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలా.. ఇలా చేయండి..!

Credit Score: క్రెడిట్‌ కార్డుల వల్ల క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోతుందా..? ఈ విధంగా పెంచుకోండి..!

Apple iOS 15: ఐఫోన్‌ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఆ అప్‌డేట్‌ వచ్చేసింది.. ఆసక్తికరమైన ఫీచర్స్‌ ఇవే..!

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్