Union bank of India: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓగా మణిమేఖ.. విజయ బ్యాంక్ నుంచి ప్రస్థానం ప్రారంభం..
యూనియన్ బ్యాంక్‌కు కొత్త ఎండీ, సీఈఓను నియమించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) కొత్త ఎండీ, సీఈఓగా ఎ మణిమేఖలై శుక్రవారం పదవీ బాధ్యతలు తీసుకున్నారు...

యూనియన్ బ్యాంక్‌కు కొత్త ఎండీ, సీఈఓను నియమించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) కొత్త ఎండీ, సీఈఓగా ఎ మణిమేఖలై శుక్రవారం పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఆమెకు బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 1988లో విజయ బ్యాంకులో ఆఫీసర్‌గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆమె అక్కడ వివిధ విభాగాల్లో పనిచేశారు. తదుపరి కెనరా బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి కష్టపడి ఎదిగారు. ప్లానింగ్, క్రెడిట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఎస్‌ఎల్‌బీసీ తదితర విభాగాల్లో పని చేశారు. తాజాగా యూబీఐ ఎండీ, సీఈఓగా అపాయింట్ అయ్యారు. బెంగుళూరు యూనివర్సిటీ నుంచి ఎంబీఏ(మార్కెటింగ్) పట్టా పుచ్చుకున్న ఆమె తదుపరి నార్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ లో డిప్లొమో కంప్లీట్ చేశారు.
అటు జాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌కు కొత్త ఎండీ, సీఈఓగా స్వరూప్ కుమార్ సాహా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నోటిఫికేషన్ జారీ విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. కోల్‌కతా యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ పుచ్చుకున్న స్వరూప్ 1990లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత బ్యాంకింగ్ రంగంలో వివిధ హోదాల్లో పని చేస్తూ వచ్చారు.



