ఈ స్మార్ట్ ఫోన్స్ చూస్తే కొనేయాల్సిందే.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. ధరెంతో తెలుసా..
నేటి యుగంలో కడుపుకు అన్నం లేకపోయినా ఉండగలరేమోగానీ ఒక్క క్షణం స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే తట్టుకోలేరు. మనదేశంలో నిత్యం కొన్ని లక్షల స్మార్ట్ ఫోన్లు అమ్మడుపోతున్నాయి. అయితే ఏవి కొనాలి, ఎలాంటి ఫీచర్లు అవసరం అనే అంశాలపై సతమతమవుతూ ఉంటారు వినియోగదారులు.

నేటి యుగంలో కడుపుకు అన్నం లేకపోయినా ఉండగలరేమోగానీ ఒక్క క్షణం స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే తట్టుకోలేరు. మనదేశంలో నిత్యం కొన్ని లక్షల స్మార్ట్ ఫోన్లు అమ్మడుపోతున్నాయి. అయితే ఏవి కొనాలి, ఎలాంటి ఫీచర్లు అవసరం అనే అంశాలపై సతమతమవుతూ ఉంటారు వినియోగదారులు. అందుకే రూ.40వేల లోపు అద్భుతమైన స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి వివిధ కంపెనీల మోడల్స్ మీముందుకు అందిస్తున్నాము. అందులో మీకు అవసరమైన వాటిని ఎంపిక చేసుకోండి.
వన్ ప్లస్ 12R..
వన్ ప్లస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని ఫీచర్లు అద్భుతంగా ఉంటాయి. అయితే 6.7 అంగుళాల AMOLED Pro XDR డిస్ ప్లేతో రూపొందించారు. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ ప్రాసెసర్ ను అమర్చారు. 16 జీబీ నుంచి 256 జీబీ వరకూ ఇంటర్లల్ స్టోరేజ్ తో మన ముందుకు వస్తోంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రూపొందించారు. అతి త్వరగా ఛార్జ్ చేసేందుకు 100 సూపర్ వోక్స్ ఛార్జర్‌ను అందిస్తున్నారు. దీంతో 15 నిమిషాల్లో 40శాతాకినికిపైగా చార్జింగ్ చేయవచ్చు. కెమెరా విషయానిక వస్తే 50మెగాపిక్సల్ సోనీ ప్రైమరీ కెమెరాను అమర్చారు. 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సల్ మైక్రో కెమెరా కలిగి ఉంది. ఇక సెల్ఫీలు తీసుకునేందుకు కూడా అనువుగా మంచి క్లారిటీ ఇచ్చేలా 16 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాతో అందుబాటులోకి తీసుకొచ్చారు.
iQOO నియో 9 ప్రో..
iQOO నియో 9 ప్రో విషయానికి వస్తే..6.78 అంగుళాల AMOLED డిస్ ప్లే, గేమ్ ప్రియులకు మంచి అనుభూతిని కల్గించేందుకు 144Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 2 ప్రాసెస్ తో 12GB RAM, 256GB ఎక్స్టర్నల్ మెమొరీతో తయారు చేశారు. 50MP సోనీ IMX 920 సెన్సార్ ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. అలాగే 5,160 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 120W PD ఫాస్ట్ ఛార్జర్ ని అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారంగా Funtouch OS 14 తో నడుస్తుంది.
OnePlus 12R, iQOO Neo 9 Pro ఈ రెండు మంచి ఫర్మామెన్స్ అందించే జాబితాలో నిలిచాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి