AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్లవిక్రయాల్లో రారాజుగా నిలిచిన కంపెనీ ఇదే.. ఫిబ్రవరి నెల గణాంకాలు వెల్లడి..

ఫిబ్రవరి 2024లో హ్యుందాయ్ విక్రయాలు మందకొడిగా సాగింది. అయితే గత ఏడాదితో పోలిస్తే హుందాయ్ మొత్తం అమ్మకాలు ఈ మధ్యకాలంలో పెరిగాయి. కానీ ఎగుమతులు తగ్గాయి. కాబట్టి దేశంలోని రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ తన మార్కెట్ గురించి తాజాగా గణాంకాలను వెల్లడించింది

కార్లవిక్రయాల్లో రారాజుగా నిలిచిన కంపెనీ ఇదే.. ఫిబ్రవరి నెల గణాంకాలు వెల్లడి..
Hundai Cars
Srikar T
|

Updated on: Mar 04, 2024 | 10:00 PM

Share

ఫిబ్రవరి 2024లో హ్యుందాయ్ విక్రయాలు మందకొడిగా సాగింది. అయితే గత ఏడాదితో పోలిస్తే హుందాయ్ మొత్తం అమ్మకాలు ఈ మధ్యకాలంలో పెరిగాయి. కానీ ఎగుమతులు తగ్గాయి. కాబట్టి దేశంలోని రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ తన మార్కెట్ గురించి తాజాగా గణాంకాలను వెల్లడించింది. ఇండియాలో మొత్తం విక్రయాలు ఫిబ్రవరిలో వార్షిక ప్రాతిపదికన 4.5 శాతం పెరిగి 60,501 యూనిట్లకు చేరుకున్నట్లు తెలిసింది. గత ఏడాది ఫిబ్రవరిలో మొత్తం విక్రయాలు 57,851 యూనిట్లుగా ప్రకటించింది సంస్థ. గత ఏడాదితో పోలిస్తే యూనిట్ల విలువలో పెరుగుదల కనిపిస్తోంది.

భారత మార్కెట్‌లో అమ్మకాలు పెరిగాయి..

ఫిబ్రవరి 2024లోమొత్తం అమ్మకాల పరంగా హ్యుందాయ్‌కి మంచి మార్కెట్ ఉంది. దేశీయ హోల్‌సేల్ అమ్మకాలు 7 శాతం పెరిగి 50,201 యూనిట్లకు చేరుకున్నాయి. 2023 ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో కాస్త పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో (ఫిబ్రవరి 2023) 47,001 యూనిట్లు.

ఎగుమతుల్లో స్వల్ప తగ్గుదల..

కంపెనీ ఎగుమతులు గత నెలలో 5 శాతం తగ్గుదల కనిపించింది.10,300 యూనిట్లకు పడిపోయాయి, ఇ ఏడాది క్రితం (2023) ఫిబ్రవరి నెలలో 10,850 యూనిట్లు ఉండగా.. ఫిబ్రవరితో పాటు జనవరి 2024లో కూడా, ఈ కంపెనీ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన తగ్గాయి, అయితే మొత్తం అమ్మకాల పరింగా చూస్తే కాస్త పెరిగింది.

ఇవి కూడా చదవండి

జనవరిలో, హ్యుందాయ్ హోల్‌సేల్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం పెరుగుదలతో 67,615 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో, దాని దేశీయ అమ్మకాలు 14 శాతం పెరిగి 57,115 యూనిట్లకు చేరుకుందని సంస్థ ప్రకటించింది. అయితే కార్ల ఎగుమతి 14 శాతం తగ్గి 10,500 యూనిట్లకు చేరుకుంది, ఇది గత ఏడాది 2023 జనవరిలో 12,170 యూనిట్లుగా నమోదైంది.

ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 5 కంపెనీలు..

  • మారుతీ సుజుకి ఫిబ్రవరిలో మొత్తం 1,97,471 యూనిట్లను విక్రయించింది.
  • హ్యుందాయ్ ఫిబ్రవరిలో మొత్తం 60,501 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది.
  • టాటా మోటార్స్ ఫిబ్రవరిలో మొత్తం 51,321 ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించింది.
  • ఫిబ్రవరిలో మహీంద్రా 42,401 ప్యాసింజర్ వాహనాలను అమ్మినట్లు సంస్థ ప్రతినిధులలు తెలిపారు.
  • టయోటా ఫిబ్రవరిలో 25,220 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్