బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు

బ్యాంకు ఉద్యోగులకు ఇది శుభవార్తే. వారి సుదీర్ఘ డిమాండ్ అయిన ఐదు రోజుల పనిదినాల కల ఈ ఏడాది సాకారం కాబోతోంది. దాంతోపాటే వేతన పెంపు కూడా ఉండే అవకాశం ఉంది. ఆర్థికమంత్రిత్వశాఖ ఇందుకు ఆమోదం తెలిపితే జూన్ నెల నుంచే ఐదు రోజుల పనిదినాల విధానం అమల్లోకి వస్తుంది. బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు గతంలో లేఖ రాసింది.

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు

|

Updated on: Mar 04, 2024 | 4:19 PM

బ్యాంకు ఉద్యోగులకు ఇది శుభవార్తే. వారి సుదీర్ఘ డిమాండ్ అయిన ఐదు రోజుల పనిదినాల కల ఈ ఏడాది సాకారం కాబోతోంది. దాంతోపాటే వేతన పెంపు కూడా ఉండే అవకాశం ఉంది. ఆర్థికమంత్రిత్వశాఖ ఇందుకు ఆమోదం తెలిపితే జూన్ నెల నుంచే ఐదు రోజుల పనిదినాల విధానం అమల్లోకి వస్తుంది. బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు గతంలో లేఖ రాసింది. ఐదు రోజుల పని వల్ల ఖాతాదారులకు సేవలు అందించే పని గంటలు తగ్గిపోవని, అలాగే ఉద్యోగులు, అధికారుల మొత్తం పనిగంటల్లోనూ ఎలాంటి మార్పులు ఉండవని అందులో హామీ ఇచ్చింది. ఐదు రోజుల పనిదినాలు ఇప్పటికే ఆర్‌బీఐ, ఎల్ఐసీలో అమల్లో ఉన్నాయని, కాబట్టి ఈ విషయాన్ని సమీక్షించి తమకు అనుకూలంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాకుల మాస్టర్ ఉద్యోగంలో తాజాగా నియమితులైన మాజీ సైనికుడు

సూర్యఘర్‌కు దరఖాస్తు ఎలా ?? రూ.78 వేల రాయితీ ఎలా పొందాలి ??

ఎట్టకేలకు ఓటీటీలోకి ‘షీనా బొరా’ హత్య కేసు డాక్యుమెంటరీ

రూ.50 కోట్ల లగ్జరీ కార్లు.. లెక్కకు మించిన ఆస్తులు

జైలు నుంచి బయటకు వచ్చాడు..మళ్లీ అదే పని చేస్తూ

Follow us