సూర్యఘర్‌కు దరఖాస్తు ఎలా ?? రూ.78 వేల రాయితీ ఎలా పొందాలి ??

సూర్యఘర్‌కు దరఖాస్తు ఎలా ?? రూ.78 వేల రాయితీ ఎలా పొందాలి ??

Phani CH

|

Updated on: Mar 04, 2024 | 4:17 PM

సౌర విద్యుత్‌ వినియోగాన్నిపెంచి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం రూపొందించిన ‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకంతో ఎన్నో లాభాలున్నాయి. రూ.75,021 కోట్లతో రూఫ్‌టాప్‌ సోలార్‌ స్కీమ్‌ కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. ఈ సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటు కోసం... గృహ వినియోగదారుల నుంచి వెబ్‌సైట్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

సౌర విద్యుత్‌ వినియోగాన్నిపెంచి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం రూపొందించిన ‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకంతో ఎన్నో లాభాలున్నాయి. రూ.75,021 కోట్లతో రూఫ్‌టాప్‌ సోలార్‌ స్కీమ్‌ కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. ఈ సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటు కోసం… గృహ వినియోగదారుల నుంచి వెబ్‌సైట్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్నవారు ఒక కిలోవాట్‌ సోలార్‌ ప్యానళ్లకు రూ.30వేల వరకు సబ్సిడీ పొందొచ్చు. మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణం తీసుకోవాలి. రెండు కిలోవాట్‌లకు రూ.60 వేలు, మూడు అంతకంటే ఎక్కువ కిలోవాట్లకు రూ.78 వేలు రాయితీగా ఇస్తారు. ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్‌ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తొలి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్‌ మీటరింగ్‌ ద్వారా విక్రయించుకోవచ్చు. దీనివల్ల నెలకు రూ.1,265 ఆదాయం వస్తుంది. అందులో రూ.610ని బ్యాంకు రుణవాయిదా కింద జమ చేసుకుంటారు. దీనివల్ల ఏడేళ్లలో ఆ రుణం తీరిపోతుందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎట్టకేలకు ఓటీటీలోకి ‘షీనా బొరా’ హత్య కేసు డాక్యుమెంటరీ

రూ.50 కోట్ల లగ్జరీ కార్లు.. లెక్కకు మించిన ఆస్తులు

జైలు నుంచి బయటకు వచ్చాడు..మళ్లీ అదే పని చేస్తూ