AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock market Scam: స్టాక్‌ మార్కెట్ పేరుతో కొత్త మోసం.. ఆశ పడితే డబ్బు గోవిందా!

రోజుకో కొత్తరకమైన స్కామ్ తో సైబర్ నేరగాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. రీసెంట్ గా స్టాక్ ట్రేడింగ్ పేరు చెప్పి ఢిల్లీలో ఆరు కోట్లు కొల్లగొట్టారు. ఐపీఓ పేరుతో నకిలీ కంపెనీ సృష్టించి అమాయకులతో స్టాక్స్ కొనిపించి బురిడీ కొట్టించారు. ఇదొక్కటే కాదు, ఇన్వెస్ట్ మెంట్స్ కు సంబంధించి ఇలాంటి స్కామ్స్ చాలానే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Stock market Scam: స్టాక్‌ మార్కెట్ పేరుతో కొత్త మోసం.. ఆశ పడితే డబ్బు గోవిందా!
Stock Market Scam
Nikhil
|

Updated on: Sep 21, 2025 | 2:48 PM

Share

డేటా చోరీ చేయడం, బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేయడం.. ఇలాంటివి మనం వింటూనే ఉంటాం. ఇవి కాకుండా.. ఇన్వెస్ట్ మెంట్ పెరుతో కూడా మోసాలు జరుగుతుంటాయి. అలాంటివే ఈ స్టాక్ మార్కెట్ స్కామ్స్. ఇవెలా ఉంటాయంటే..

హై ప్రాఫిట్స్

సైబర్ నేరగాళ్లు ముందుగా సోషల్ మీడియా లేదా వాట్సాప్ ప్రమోషనల్ మెసేజ్‌ల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో నకిలీ స్కీమ్స్ క్రియేట్ చేసి పోస్టులు పెడతారు. స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ఉందని, ఇప్పుడు ఇన్వెస్ట్‌ చేస్తే.. మంచి ప్రాఫిట్స్ వస్తాయని..  కొంత మొత్తం చెల్లిస్తే.. మేము గైడెన్స్ ఇస్తామని నమ్మిస్తారు. వాళ్ల మాటలు నమ్మి వాళ్ల వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రాం గ్రూపుల్లో జాయిన్ అయితే ఇక అంతే సంగతి.. ఇన్వెస్ట్ మెంట్స్ చేసేందుకు వీళ్లే ఒక యాప్ క్రియేట్ చేస్తారు. అవి అచ్చం గ్రో, జిరోదా వంటి ఇన్వెస్ట్ మెంట్ యాప్స్ ను పోలి ఉంటాయి. అందులో మనకు తెలిసిన కంపెనీల స్టాక్స్ కనిపిస్తాయి. కానీ, అవన్ని వాళ్లు క్రియేట్ చేసిన ఫేక్ వివరాలు. అది తెలియక అందులో ఇన్వెస్ట్ చేస్తే.. ఇక అంతే సంగతులు. ఒకసారి యాడ్ చేసిన డబ్బు మళ్లీ తిరిగి రాదు.

ఐపీఓ స్కామ్

ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గురించి కొంత ఐడియా ఉన్నవాళ్లను టార్గెట్ చేస్తూ.. ఈ స్కామ్ అమలు చేస్తారు. కొత్తగా కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతుందని.. తక్కువ స్టాక్ ప్రైస్ తో ఐపీఓకి వెళ్తుందని త్వరగా ఇన్వెస్ట్ చేస్తే.. ప్రాఫిట్స్ అని నమ్మించి ఫేక్ లింక్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయిస్తారు. అది నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు గోవిందా.

ఇలా కూడా..

ఇక వీటితోపాటు ఆయిల్ ట్రేడింగ్ అని.. క్రిప్టో ట్రేడింగ్ అని..  వీటిలో ఇన్వెస్ట్ చేస్తే నాలుగైదు నెలల్లో డబ్బులు రెట్టింపు అవుతాయని.. ఇలా నకిలీ యాప్స్ తో చాలా రకాలైన ఇన్వెస్ట్ మెంట్ స్కామ్స్ జరుగుతాయి. వీటిని చూసి ఆశ పడితే మొదటికే మోసపోక తప్పదు. కాబట్టి ఇలాంటి స్కామ్స్ పట్ల అవగాహన పెంచుకోవడం ముఖ్యం.

జాగ్రత్తలు ఇలా..

  • ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఆశ చూపేవాళ్ల మాటల నమ్మకూడదని గుర్తుంచుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కోసం పేటియం, గ్రో, అప్ స్టాక్స్, ఏంజిల్ వన్, జిరోధా.. ఇలా బోలెడు ఒరిజినల్ యాప్స్ ఉండగా డూప్లికేట్ యాప్స్ వాడాల్సిన అవసరం ఏముంది. అలా వేరే యాప్స్ లో ఇన్వెస్ట్ చేయిస్తున్నాంటే.. వాళ్లు కచ్చితంగా మోసగాళ్లే అని గుర్తు.
  • నకిలీ యాప్స్ ద్వారా పెట్టుబడి పెట్టించేవాళ్లు ముందు కొన్ని రోజుల పాటు నిజంగా ప్రాఫిట్స్ చూపిస్తారు. వాటిని విత్ డ్రా చేసుకునే ఆప్షన్ కూడా కల్పిస్తారు. అలా కొంత నమ్మకం కుదిరాక ఉన్నట్టుండి ఒకరోజు సడెన్ గా జాక్ పాట్ ట్రేడింగ్ అని తొందర పెట్టి ఉన్నదంతా పెట్టుబడి పెట్టించేలా మాయ చేస్తారు. ఇక ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్ ఉండదు. యాప్ ఉండదు.
  • ఇకపోతే ఎలాంటి యాప్ అయినా.. ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి తప్ప లింక్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోకూడదు. అలాగే స్టా్క్ మార్కె్ట్ అనేది అందరికీ ఒకేలా వర్తిస్తుందే తప్ప యాప్స్‌ను బట్టి ప్రాఫిట్స్ పెరగడం అనేది ఉండదు. కాబట్టి ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి
సంతోషాన్ని లాగేసుకున్నా నేను 'రిచ్​'నే.. నటి ఎమోషనల్ పోస్ట్!
సంతోషాన్ని లాగేసుకున్నా నేను 'రిచ్​'నే.. నటి ఎమోషనల్ పోస్ట్!
YouTubeలో 1,000 వ్యూస్‌కు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎక్కువ రావాలంటే
YouTubeలో 1,000 వ్యూస్‌కు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎక్కువ రావాలంటే
భల్లాల దేవ బాడీ సీక్రెట్ ఇదే..
భల్లాల దేవ బాడీ సీక్రెట్ ఇదే..