AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిక్కెట్ లేకుండా రైలు ఎక్కొచ్చు.. కానీ?

టిక్కెట్ లేకుండా రైలు ఎక్కొచ్చు.. కానీ?

Phani CH
|

Updated on: Sep 21, 2025 | 2:41 PM

Share

మీరు తరచూ రైలు ప్రయాణం చేస్తున్నారా? దూర ప్రాంతాలకు, తీర్థయాత్రలకు మీ కుటుంబంతో ట్రైన్లలోనే ప్రయాణిస్తుంటారా? అయితే.. మీరు ఎప్పటికప్పుడు మారుతున్న రైల్వే రూల్స్ గురించి తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు.. కొత్త నిబంధనల ప్రకారం, పాక్షికంగా కన్ఫర్మ్ అయిన టికెట్‌తో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి రిజర్వ్డ్ బోగీల్లో ప్రయాణించడానికి అనుమతి లేదు.

మీ కుటుంబంలో నలుగురు ఉంటే.. ఇద్దరికి సీట్లు కన్పామ్ అయి, మిగిలిన ఇద్దరికి వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే.. కేవలం కన్ఫామ్ టికెట్ ఉన్నవారు మాత్రమే రిజర్వుడు బోగీలో ప్రయాణించగలరు. దీనిపై ఈ ఏడాది మే 1 నుంచి ఈ రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. దీనిని పట్టించుకోకుండా మిగిలిన ఇద్దరినీ మీతో బాటు రిజర్వుడు బోగీలో తీసుకుపోతే.. వారిద్దరికీ టీసీ జరిమానా విధించే ఛాన్స్ ఉంది. అదే.. ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ టికెట్ RAC గా (రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్) మారితే మీరు రిజర్వుడు బోగీలో కూర్చోవచ్చు. అయితే.. వేరొకరితో సీటు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే.. రైలు బయలుదేరే టైంకి..RACగా మారకపోతే.. వెంటనే.. ఆన్‌లైన్‌లో జనరల్ టికెట్ కొనుక్కొని.. జనరల్ బోగీలో ప్రయాణించటం మంచిది. మనం చాలా సార్లు అత్యవసర పనుల కోసం.. ముందుగానే రైల్వే టికెట్లు బుక్​ చేసుకుంటాం. కానీ అనుకోని పరిస్థితులు వల్ల సదరు పనులు వాయిదా పడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మన టికెట్ వృథా అయిపోతుంది. అయితే రైలు ప్రయాణానికి ముందే మనం సమాచారం ఇస్తే.. టికెట్​ ధరలో కొంత మినహాయించుకుని, మిగతా సొమ్మును మనకు అందించడం జరుగుతుంది. అయినప్పటికీ మనకు కొంత మేరకు మనీలాస్​ అయినట్లే లెక్క. అందుకే రైల్వే కన్ఫార్మ్ టికెట్​ను.. కుటుంబ సభ్యులకు అంటే అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భార్య, కొడుకు, కూతరులకు బదిలీ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. కానీ కన్ఫార్మ్డ్​ టికెట్​ను బదిలీ చేయాలంటే 24 గంటల ముందు IRCTC పోర్టల్​లో ట్రాన్స్​ఫర్​ రిక్వెస్ట్ పెట్టాలి. అనుకోకుండా ప్రయాణాలు చేసేవాళ్లు, క్యూ లైన్‌లో నిలబడి టిక్కెట్‌ తీసుకునేంత టైంలేక హడావుడిగా రైలు ఎక్కేవారు రిజర్వ్ బోగీలో ఎక్కి.. టీసీతో మాట్లాడి టికెట్ తీసుకోవచ్చు. రూల్‌ ప్రకారం అలాంటి ప్రయాణీకులు వారు ఎక్కిన స్టేషన్ నుంచి రైలు చివరి స్టేషన్ వరకు అయ్యే మొత్తం ఛార్జీతో బాటు.. జరిమానాగా 250 రూపాయలు కూడా కట్టాల్సి ఉంటుంది. చాలాసార్లు రైలులో చార్ట్‌ సిద్ధమయ్యాక సీట్లు ఖాళీగా మిగిలిపోతుంటాయి. ఈ క్రమలో ఖాళీ సీట్లను దృష్టిలో పెట్టుకొని రైల్వేశాఖ కరెంట్‌ టికెట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని ప్రారంభించింది. రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు చార్ట్‌ తయారవుతుంది. చార్ట్‌ రెడీ అయ్యాక రైలు బయలుదేరే ఐదు, పదినిమిషాల ముందు సైతం కరెంట్‌ టికెట్‌ బుకింగ్‌ ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. చార్ట్ తయారు చేసిన తర్వాత, రైలులో సీట్లు ఖాళీగా ఉంటే.. ప్రయాణికులకు కరెంటు బుకింగ్‌ విధానంలో టికెట్‌ జారీ చేస్తారు. అయితే, రైలులో బెర్తులు ఖాళీగా ఉంటే మాత్రమే బెర్తులు కన్ఫర్మ్‌ అవుతాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫైబర్‌ సప్లిమెంట్లతో సమస్యలు తప్పవు!

బుడిపెలున్న చేపను చూసారా

ట్యాంక్‌లో ఇరుక్కున్న ఏనుగు.. ఎలా కాపాడారో చూడండి

ఎలుగుబంటికి కూల్‌ డ్రింక్‌ ఇచ్చిన యువకుడు.. తర్వాత ఏమైందంటే

బెడ్‌పై పడుకుందామని దుప్పటి తీసిన వ్యక్తి… దెబ్బకు పరుగో పరుగు