ఎలుగుబంటికి కూల్ డ్రింక్ ఇచ్చిన యువకుడు.. తర్వాత ఏమైందంటే
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని యువత రకరకాల వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంటారు. అవి కొన్ని ఆకట్టుకునే విధంగా ఉంటే.. కొన్ని నవ్వు తెప్పిస్తాయి..కొన్ని మాత్రం నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈవీడియో చూసిన జంతు ప్రేమికులు ఆ యువకుడు చేసిన పనికి మండిపడుతున్నారు.
అలాంటివారికి హితబోధ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పార్క్‌లాంటి ప్రదేశంలోకి వెళ్లాడు ఓ యువకుడు. అక్కడ దూరంగా ఓ ఎలుగుబంటి కనిపించింది. ఆ యువకుడికి అది నీళ్లకోసం వెతుకుతున్నట్టుగా అనిపించింది. వెంటనే తన దగ్గర ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ మూత తీసి ఎలుగుబంటికి కొంచెం దగ్గరలో పెట్టి, అది ఎక్కడ అతనిపై దాడి చేస్తుందోనని భయపడి వెనక్కి వచ్చేసాడు. ఆ ఎలుగుబంటి మెల్లగా ఆ కూల్ డ్రింక్ బాటిల్ దగ్గరకి వచ్చింది. ఆ డ్రింక్ బాటిల్ తీసుకుని గటగటా తాగేసింది. ఆ తర్వాత థాంక్స్ అన్నట్టుగా ఆ యువకుడివైపు చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా వీడియో రికార్డ్ చేసిన యువకుడు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు రిల్స్ పిచ్చితో యువత చేస్తున్న పనులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలుగుబంటి ఆ యువకుడిపై దాడిచేస్తే పరిస్థితి ఏంటని కొందరు కామెంట్ చేశారు. కూల్ డ్రింక్స్ ఎలుగుబంటి ఆరోగ్యానికి హానికరమని, వన్యప్రాణుల పట్ల ఆ యువకుడి తీరు సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెడ్‌పై పడుకుందామని దుప్పటి తీసిన వ్యక్తి… దెబ్బకు పరుగో పరుగు
ఇళ్లకు తలుపులే లేని గ్రామం.. మరి దొంగలు పడితే..?
వామ్మో… వచ్చే ఏడాది అలా జరగబోతుందా? బాంబు పేల్చిన బాబా వంగా!
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్
రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు
హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్ !!
గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి

