బెడ్‌పై పడుకుందామని దుప్పటి తీసిన వ్యక్తి… దెబ్బకు పరుగో పరుగు
ఇటీవల కాలంలో పాములు బెడద బాగా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా పాములే కనిపిస్తున్నాయి. ఇళ్లలో చేరి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ చేరి పరుగులు పెట్టిస్తున్నాయి. ఇళ్లలో ఏసీలు, ఫ్రిడ్జ్‌లు బీరువాలు ఇలా ఎక్కడచూసినా పాములే.. ఇప్పుడు వీటన్నిటీ వదిలేసి మంచాలపై తిష్టవేస్తున్నాయి. దుప్పటికింద చేరి వెచ్చగా సేదదీరుతున్నాయి.
అలా ఇంట్లో బెడ్‌పైన పడుకుందామని వెళ్లిన వ్యక్తికి దుప్పటిలో ఉన్న పామును చూసి వణుకు పుట్టింది. దెబ్బకు అక్కడినుంచి బయటకు పరుగులు తీశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి పడుకోవడానికి తన రూమ్‌లో మంచం వద్దకు వెళ్లాడు. బెడ్‌పైన ఉన్న బెడ్‌షీట్‌లో ఏదో కదులుతున్నట్టు అతనికి అనుమానం వచ్చింది. మెల్లగా దుప్పటిని పైకి లేపాడు. హలో నేనున్నానిక్కడ అన్నట్టుగా పాము మెల్లగా పాకుతూ తల బయటకు పెట్టి చూస్తుంది. పామును చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది కాటు వేసేది. ముందే గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చలికాలంలో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పాములు ఇళ్లలో చేరి మంచాల కింద, గ్యాస్ సిలిండర్లు, ఫ్రిడ్జ్‌లు, కూలర్ల మాటున తిష్టవేస్తుంటాయి. ఇప్పుడు దుప్పట్లో కనిపించిన పాము వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను దాదాపు 90 వేలమంది వీక్షించగా 2 వేలమంది లైక్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇళ్లకు తలుపులే లేని గ్రామం.. మరి దొంగలు పడితే..?
వామ్మో… వచ్చే ఏడాది అలా జరగబోతుందా? బాంబు పేల్చిన బాబా వంగా!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!

