ట్యాంక్‌లో ఇరుక్కున్న ఏనుగు.. ఎలా కాపాడారో చూడండి
నీటి ట్యాంకులో ఇరుక్కుపోయిన ఓ ఏనుగు బయటకు రాలేక నానా అవస్థలు పడిన ఘటన తమిళనాడులో జరిగింది. ఐఎఫ్ఎస్ అధికారి సుప్రీయా సాహూ ఆ వీడియోను షేర్ చేశారు. జనావాసాలు పెరుగుతున్న కొద్దీ అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. జంతువులు ఆహారం వెతుక్కుంటూ జనావాసాల వైపు వచ్చి ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాయి.
సరిగ్గా ఇలాగే చిక్కుల్లో పడ్డ ఏనుగును అటవీ శాఖ సిబ్బంది రక్షించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుప్రియా సాహూ షేర్ చేశారు. వీడియోలో నెటిజన్లు అటవీ శాఖ సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కూనూర్ ప్రాంతం నీలగిరి అడవుల్లో ఈ ఘటన జరిగింది. ఓ గిరిజన గ్రామానికి సమీపంలోని నీటి ట్యాంకులో ఏనుగు ఇరుక్కుపోయింది. అటవీ శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని ట్యాంకు బద్దలు కొట్టి ఏనుగు బయటకొచ్చేలా చేశారు. అటవీ శాఖ సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. వన్యప్రాణు లకు అసలైన రక్షకులు వీళ్లేనని కితాబిచ్చారు. రకరకాల కామెంట్స్ మధ్య వీడియో ప్రస్తుతం ట్రెండవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎలుగుబంటికి కూల్ డ్రింక్ ఇచ్చిన యువకుడు.. తర్వాత ఏమైందంటే
బెడ్‌పై పడుకుందామని దుప్పటి తీసిన వ్యక్తి… దెబ్బకు పరుగో పరుగు
ఇళ్లకు తలుపులే లేని గ్రామం.. మరి దొంగలు పడితే..?
వామ్మో… వచ్చే ఏడాది అలా జరగబోతుందా? బాంబు పేల్చిన బాబా వంగా!
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

