TVS Jupiter: ఆ రోజే టీవీఎస్ అప్‌డేటెడ్ స్కూటర్ లాంచ్..? ఆకర్షిస్తున్న ప్రత్యేక ఫీచర్లు
ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్ హవా పెరగడంతో ప్రముఖ కంపెనీలు మాత్రం ఉన్న మోడల్స్‌కే సరికొత్త అప్‌డేట్స్‌ను ఇస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ టీవీఎస్ ఆగస్టు 22న స్కూటర్ అప్‌డేట్ ఇస్తామనిప పేర్కొంది. అయితే ఏ మోడల్ స్కూటర్ అప్‌డేట్ ఇస్తారనే విషయం అధికారికంగా ప్రకటించలేదు. కానీ రాబోయే అప్‌డేట్ టీవీఎస్ జూపిటర్ గురించే అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీవీఎస్ స్కూటర్ అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

భారతదేశంలో ఇటీవల కాలంలో స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది. ఇంట్లో ఒక్క స్కూటర్ ఉంటే ఇంటెళ్లిపాదిగా ఉపయోగపడుతుందనే తలంపుతో చాలా మంది స్కూటర్లు కొనుగోలు చేస్తున్నారు. భారత్‌లో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు కూడా కొత్త స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్ హవా పెరగడంతో ప్రముఖ కంపెనీలు మాత్రం ఉన్న మోడల్స్‌కే సరికొత్త అప్‌డేట్స్‌ను ఇస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ టీవీఎస్ ఆగస్టు 22న స్కూటర్ అప్‌డేట్ ఇస్తామనిప పేర్కొంది. అయితే ఏ మోడల్ స్కూటర్ అప్‌డేట్ ఇస్తారనే విషయం అధికారికంగా ప్రకటించలేదు. కానీ రాబోయే అప్‌డేట్ టీవీఎస్ జూపిటర్ గురించే అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీవీఎస్ స్కూటర్ అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ వచ్చే వారంలో ఆసక్తికర అప్‌డేట్‌తో మన ముందుకు వస్తుందని నిపుణులు చెబుతన్నారు. రాబోయే టీవీఎస్ జూపిటర్ 110 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. అయితే ఈ స్కూటర్ ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నా ఏళ్లుగా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. టీవీఎస్ స్కూటర్ అమ్మకాల్లో జూపిటర్ అగ్రభాగాన నిలుస్తున్నా ఇటీవల కాలంలో మాత్రం అమ్మకాల్లో కొంత వెనుకబడింది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్‌ను అప్‌డేట్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డిజైన్‌తో పాటు ఫీచర్లపరంగా అప్‌డేట్ చేస్తారని అంచనా వేస్తున్నారు. ఎల్ఈడీ డీఆర్ఎల్‌తో ఎల్ఈడీ లైటింగ్, మరింత స్టైలిష్ ప్యానెల్స్, మెరుగైన అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ కన్సోల్, టర్న్-బై-టర్న్ వంటి ఫీచర్లు ఇచ్చే అవకాశం ఉంది.
అయితే టీవీఎస్ జూపిటర్ 125 వెర్షన్ విషయానికి వస్తే అండ్ సీట్ స్పేస్ అప్‌డేట్‌తో పాటు ఇతర ఫీచర్లతో అప్‌డేట్ చేస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్ట్ 22న వచ్చే కొత్త జూపిటర్ 110 కాదా? అని టీవీఎస్ ఇంకా ధ్రువీకరించలేదు. అయితే లాంచ్‌కు ముందే అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలు అందించే అవకాశం ఉంది. ప్రస్తుత టీవీఎస్ జూపిటర్ 110 ధర రూ.77,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ మోడల్ హెూండా యాక్టివా, హెూండా డియో, హీరో జూమ్, హీరో ప్లెజర్ + వంటి వాటితో పోటీపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








