Toy Industry: ఎగుమతుల్లో ఆ పరిశ్రమ రికార్డులు.. ఐదేళ్లల్లో 40 శాతం వృద్ధి
చిన్నపిల్లలకు ఆడుకునే బొమ్మలు అంటే ఓ ఎమోషన్. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఇష్టాన్ని కాదు అనలేక వెరైటీ బొమ్మలను కొనుగోలు చేస్తూ ఉంటారు. గతంలో మన దేశంలో దొరికే చాలా వరకు బొమ్మలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అయితే క్రమేపి దేశంలో బొమ్మల తయారీ రంగం బాగా విస్తరించింది. దిగుమతి చేసుకునే స్థితి నుంచి ఎగుమతులు చేసే స్థాయికు వెళ్లింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో బొమ్మల పరిశ్రమ వృద్ధి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశ బొమ్మల పరిశ్రమ బలమైన వృద్ధి సాధిస్తుందని పేర్కొంది. త్వరలో భారత్ ప్రపంచ బొమ్మల మార్కెట్‌లో ఎక్కువ వాటాను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. 2032 నాటికి 179.4 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలోని బొమ్మల పరిశ్రమలో పెరిన నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నాణ్యమైన బొమ్మల తయారీలో భారత్ తన మార్క్ వేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2023లో దాదాపు 1.5 బిలియన్ల డాలర్ల విలువైన భారతీయ బొమ్మల మార్కెట్ ప్రభుత్వం నుంచి గణనీయమైన విధాన మద్దతును పొందింది. 2025-26 కేంద్ర బడ్జెట్ బొమ్మల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం ద్వారా ఈ రంగం వృద్ధికి భారతదేశ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అర్థం చేసుకోవాలని నిపుణులు వివరిస్తన్నారు.
బొమ్మల తయారీ రంగంలో క్లస్టర్ అభివృద్ధిని పెంచడం, నైపుణ్యాలను పెంపొందించడం, బలమైన తయారీ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుని కేంద్రం బొమ్మల పరిశ్రమకు ప్రత్యేక రాయితీలను ఇస్తుంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్ కింద అధిక-నాణ్యత, వినూత్నమైన, స్థిరమైన బొమ్మలను ఉత్పత్తి చేయడంపై దృష్టి కేంద్రీకరించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ విధానాల కారణంగా దేశీయంగా బొమ్మల తయారీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాయని నిపుణులు పేర్కొంటున్నారు. 2020లో క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యూసీఓ) అమలు బొమ్మలకు కఠినమైన నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించింది.
ఫిబ్రవరి 2020లో దిగుమతి సుంకాలను 20 శాతం నుంచి 60 శాతానికి, మార్చి 2023లో 70 శాతానికి పెంచింది. ఈ చర్యలు దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు బొమ్మల దిగుమతులను గణనీయంగా తగ్గించాయి. 2018-19 ఆర్థిక సంవత్సరలో 304 మిలియన్ల డాలర్ల నుంచి2023-24 ఆర్థిక సంవత్సరానికి కేవలం 65 మిలియన్ల డాలర్లకు తగ్గాయి. అంటే 79 శాతం తగ్గుదలను నమోదైంది. ఇక ఎగుమతులు 40 శాతం పెరిగి 109 మిలియన్ల డాలర్ల నుంచి నుండి 152 మిలియన్ల డాలర్లకు పెరిగాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








