Today Gold Price: బంగారం కొనాలంటే ఇదే మంచి ఛాన్స్!.. మరింత తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్ ఎంతంటే..
Today Gold Price: దేశీయంగా బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. తాజాగా మరోసారి పసిడి ధర భారీగా పడిపోయింది. పది గ్రాముల గోల్డ్ రేట్
Today Gold Price: దేశీయంగా బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. తాజాగా మరోసారి పసిడి ధర భారీగా పడిపోయింది. గోల్డ్ రేట్ ఇవాళ పది గ్రాములపై రూ. 661 తగ్గింది. ప్రస్తుతం తగ్గిన ధరతో కలిపి దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. రూ.46,847 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక హైదరాబాద్ మార్కెట్ చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 48,290 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,250 ఉంది.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో.. 24 క్యారెట్ల మేలిమి బంగారం పది గ్రాముల ధర రూ. 48,290 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 44,250 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలోనూ ఇదే స్థాయిలో పసిడి ధరలు పడిపోయాయి. విశాఖలో శుక్రవారం నాడు పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 48,290 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 44,250 గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడికి డిమాండ్ తగ్గడం వల్లే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 1,815 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Also read: