AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: హైదరాబాద్‌లో మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ.. రాబోయే రేండేళ్లలో 15 ఏర్పాటుకు రంగం సిద్ధం..

MS Dhoni Cricket Academy In Telangana: టీమిండియా మాజీ కెప్టెన్.. మిస్టర్ కూల్ తర్వలోనే క్రికెట్ అకాడమీలను ప్రారంభించనున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు...

MS Dhoni: హైదరాబాద్‌లో మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ.. రాబోయే రేండేళ్లలో 15 ఏర్పాటుకు రంగం సిద్ధం..
Narender Vaitla
|

Updated on: Feb 12, 2021 | 7:43 PM

Share

MS Dhoni Cricket Academy In Telangana: టీమిండియా మాజీ కెప్టెన్.. మిస్టర్ కూల్ తర్వలోనే క్రికెట్ అకాడమీలను ప్రారంభించనున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు వారికి అన్ని రకాలు సహాకారులు అందించే ఉద్దేశంతో అకాడమీలను ప్రారంభించన్నాడు. రాబోయే రెండేళ్లలో కనీసం 15 అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోగా అందులో హైదరాబాద్‌లో కూడా ఒకటి కావడం విశేషం. ‘ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ’ పేరుతో అకాడమీని నెలకొల్పనున్నారు. ఈ విషయమై ఇప్పటికే ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ.. బ్రియినియాక్స్‌ బీతో ఒప్పందం చేసుకుంది. భారత మాజీ అండర్-19 ప్రపంచకప్ జట్టు సభ్యుడు, ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మిహిర్ దివాకర్ దీనికి సంబంధించి వివరాలను వెల్లడించాడు. రాబోయే రెండేళ్లలో తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ధోనీ విద్యా రంగంలోకి కూడా ప్రవేశించనున్నాడు. వచ్చే జూన్ నుంచి బెంగళూరులో ఎంఎస్ ధోనీ గ్లోబల్ స్కూల్‌ను ప్రారంభించనున్నాడు.

Also Read: India Vs England 2021: ‘ఆ విషయం నేను చెప్పను’.. మీడియా ప్రతినిధులకు షాక్ ఇచ్చిన అజింక్యా రహానే..