AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinay Kumar: 13 ఏళ్ల వయసులోనే క్రికెటర్ కావాలని కల కన్నాడు.. దాన్ని నిజం చేసుకున్నాడు. వినయ్ కుమార్ సక్సెస్ జర్నీ..

Crickter Vinay Kumar Sucess Story: నిరుపేద కుటుంబం, ప్రభుత్వ పాఠశాలలో విద్యాభోధన ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన ఓ యువకుడు అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలో ఆడే స్థాయికి చేరుకున్నాడు. అతనే రాంగనాథ్ వినయ్ కుమార్....

Vinay Kumar: 13 ఏళ్ల వయసులోనే క్రికెటర్ కావాలని కల కన్నాడు.. దాన్ని నిజం చేసుకున్నాడు. వినయ్ కుమార్ సక్సెస్ జర్నీ..
Narender Vaitla
|

Updated on: Feb 12, 2021 | 8:24 PM

Share

Crickter Vinay Kumar Sucess Story: నిరుపేద కుటుంబం, ప్రభుత్వ పాఠశాలలో విద్యాభోధన ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన ఓ యువకుడు అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలో ఆడే స్థాయికి చేరుకున్నాడు. అతనే రాంగనాథ్ వినయ్ కుమార్. కర్ణాటక జట్టు తరఫున రంజీ మ్యాచ్‌తో కెరీర్ మొదలు పెట్టిన వినయ్ కుమార్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. నేడు (ఫిబ్రవరి 12) వినయ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ జీవితంలో కొన్ని కీలక విషయాల గురించి తెలుసుకుందామా.? 1984 ఫిబ్రవరి 12న కర్ణాటకలోని దేవనగరి ప్రాంతంలో ఓ నిరూపేద కుటుంబంలో జన్మించాడు వినయ్ కుమార్. 13 ఏళ్ల వయసులోఉన్నప్పుడే వినయ్‌కు క్రికెటర్ కావాలనే కల ఉండేది. అయితే అందరిలా కలలు మాత్రమే కనకుండా దాని కోసం ఎంతో కష్టపడి సాధించాడు వినయ్. తన కుటుంబ ఆర్థిక స్థితిగతులను ఎదురించి మరీ అతని స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. మొదట బ్యాట్స్‌మెన్‌గా రాణించాలనుకున్నా వినయ్ కుమార్‌ బౌలింగ్‌లో తన ప్రతిభను కనబరిచాడు. వినయ్ కుమార్ తన తొలి రంజీ మ్యాచ్‌ను కర్ణాటక తరఫున కోల్‌కతాలో ఆడాడు. బెంగాల్ జట్టు ప్రత్యర్థిగా జరిగిన మ్యాచ్‌లో వినయ్ కుమార్ రోహన్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాల వికెట్లను తీసుకున్నాడు. ఇక 2007-08లో జరిగిన రంజీ సీజన్‌లో వినయ్ కుమార్ ఏకంగా 40 వికెట్లు తీసుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ వికెట్ల సంఖ్య 2009-10 నాటికి 53కి పెరగడం విశేషం. అనంతరం వినయ్ కుమార్ ప్రతిభను గుర్తించిన క్రికెట్ బోర్డ్ 2010లో వెస్టిండిస్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో స్థానం సంపాదించాడు. ఈ సిరీస్‌లో ప్రత్యర్థి జట్టు శ్రీలంకతో ఆడిన వినయ్ తన బౌలింగ్‌తో కుమార్ సంగాక్కర, సనత్ జయసూర్య వంటి దిగ్గజాల వికెట్లను పడకొట్టాడు. కానీ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో టోర్నీ నుంచి వెను తిరిగింది. ఇక టీ20లో ఆడుతూనే మరోవైపు కర్ణాటక రంజీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వినయ్ కుమార్ 2013-14, 2014-2015లో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఓవైపు విజయాలతో పలు అపజయాలను కూడా మూటగట్టుకున్నాడు వినయ్ కుమార్. 2012లో టెస్ట్‌ క్రికెట్‌లోకి రంగ ప్రవేశం చేసిన వినయ్ కుమార్ ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పొందింది. ఇందులో వినయ్ కుమార్ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ తర్వాత వినయ్ కుమార్ మరో టెస్ట్ మ్యాచ్ ఆడకపోవడం గమనార్హం. ఇక వన్టే క్రికెట్‌లోనూ వినయ్ కుమార్ ఘోర వైఫల్యాలను చవిచూశాడు. 2013లో బెంగళూరు ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో 9 ఓవర్లలో ఏకంగా 102 పరుగులు ఇచ్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పెద్దగా రాణించని వినయ్ కుమార్.. ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో మాత్రం మంచి ప్రతిభను కనబరిచాడు. 139 మ్యాచ్‌లలో ఏకంగా 504 వికెట్లు తీసుకొని రికార్డు నెలకొల్పాడు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ఐపీఎల్‌లో కూడా మంచి ప్రతిభను కనబరిచాడు. పేద కుటుంబం నుంచి ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగిన వినయ్ కుమార్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, క్రికెట్ రంగంలో మరెన్నో శిఖరాలను అధిరోహించాలని మనమూ కోరుకుందాం.

Also Read: IPL-2021 Player Auction: ఐపీఎల్‌-2021 మినీ వేలం.. జాబితాలో అతిచిన్న, అతిపెద్ద వయస్కులు వీరే..!