AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card Lock: మీ ఆధార్‌ భద్రంగా లేదన్న భావనలో ఉన్నారా.? ఇలా సింపుల్‌గా లాక్‌ చేసుకోండి..

బ్యాంక్‌ అకౌంట్స్‌ మొదలు ఆర్థికపరమైన అన్ని అంశాలకు ఆధార్‌ కార్డ్‌ను లింక్‌ చేయాల్సిందే. అయితే ఆధార్‌ కార్డును హ్యాక్‌ చేస్తున్న సంఘటనలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు మన ఆధార్‌ కార్డ్‌ నిజంగానే భద్రంగానే ఉందా అన్ని అనుమానాలు వస్తున్నాయి. ఆధార్‌ కార్డ్‌ యాక్సెస్‌ చేయగలిగితే, మన సమస్త సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతులో పెట్టినట్లే అవుతుంది. అయితే ఆధార్‌ కార్డ్‌ అవసరం లేని సమయంలో...

Aadhaar Card Lock: మీ ఆధార్‌ భద్రంగా లేదన్న భావనలో ఉన్నారా.? ఇలా సింపుల్‌గా లాక్‌ చేసుకోండి..
Aadhaar Card
Narender Vaitla
|

Updated on: Oct 17, 2023 | 7:47 PM

Share

ఇప్పుడు ఏ చిన్న పనిచేయాలన్నా ఆధార్‌ కార్డ్ వినియోగం అనివార్యంగా మారిపోయింది. ఇంటి కొనుగోలు నుంచి సిమ్‌ కార్డ్‌ వరకు ఏది కొనుగోలు చేయాలన్నా కచ్చితంగా ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిందే. ఆధార్‌ అంతలా మనిషి జీవితంలో భాగమైపోయింది. ఆధార్‌ కార్డు వినియోగం భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో నేరాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఆధార్‌ కార్డును దుర్వినియోగం చేస్తూ పలువురు సైబర్‌ నేరగాళ్లు ట్యాంపరింగ్ చేస్తున్నారు.

బ్యాంక్‌ అకౌంట్స్‌ మొదలు ఆర్థికపరమైన అన్ని అంశాలకు ఆధార్‌ కార్డ్‌ను లింక్‌ చేయాల్సిందే. అయితే ఆధార్‌ కార్డును హ్యాక్‌ చేస్తున్న సంఘటనలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు మన ఆధార్‌ కార్డ్‌ నిజంగానే భద్రంగానే ఉందా అన్ని అనుమానాలు వస్తున్నాయి. ఆధార్‌ కార్డ్‌ యాక్సెస్‌ చేయగలిగితే, మన సమస్త సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతులో పెట్టినట్లే అవుతుంది. అయితే ఆధార్‌ కార్డ్‌ అవసరం లేని సమయంలో కార్డును లాక్‌ చేసుకొని, మళ్లీ అన్‌లాక్‌ చేసుకోవడం ద్వారా ఆధార్‌ను సెక్యూర్‌ చేసుకోవచ్చు. ఇంతకీ ఆధార్‌ను ఎలా లాక్‌ చేసకోవాలి.? ఎలా అన్‌లాక్‌ చేసకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఆధార్‌ కార్డును లాక్‌ చేసుకోవడానికి ఆధార్‌ సెంటర్‌కు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా ఆధార్‌ కార్డును లాక్‌ లేదా అన్‌లాక్‌ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆధార్‌ కార్డ్‌ లాక్‌ అయితే ఎవరూ కార్డును ఉపయోగించలేరు. ఆధార్‌ను లాక్‌ చేస్తే బయోమెట్రిక్‌, ఓటీపీ లాంటి సేవలేవీ పనిచేయవు. ఆధార్‌ కార్డును లాక్‌ లేదా అన్‌లాక్‌ చేయడానికి వర్చువల్‌ ఐడీని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వర్చువల్ ఐడీని కూడా సింపుల్‌గా ఎస్‌ఎంఎస్‌ లేదా యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో క్రియేట్ చేసుకోవచ్చు.

ఎలా లాక్‌ చేసుకోవాలంటే..

ఆధార్‌ కార్డును లాక్‌ చేసుకోవాలంటే ముందుగా మీ రిజిస్టర్‌ మొబైల్‌ నుంచి GETOTP అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి మీ ఆధార్‌ నెంబర్‌లోని చివరి 4 నెంబర్లను టైప్‌ చేసి 1947 నెంబర్‌కు పంపాలి. వెంటనే యూఐడీఏఐ నుంచి మీకు 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత LOCKUID అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఆధార్‌ నెంబర్‌లోని లాస్ట్‌ 4 అంకెలు ఇచ్చి, అంతకు ముందు వచ్చిన 6 అంకెల ఓటీటీపి ఎంటర్‌ చేసి సెండ్‌ చేయాలి. వెంటనే మీ ఆధార్‌ కార్డు లాక్‌ అవుతుంది. మీ ఆధార్‌ కార్డు లాక్‌ అయినట్లు వెంటనే మీ ఫోన్‌కు కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ వస్తుంది.

ఇక అన్‌లాక్‌ చేయడం ఏలాగంటే..

లాక్‌ చేసిన ఆధార్‌ కార్డును ఎస్‌ఎంఎస్‌తోనే అన్‌లాక్‌ చేసకోవచ్చు. ఇందుకోసం ముందుగా GETOTP అని టైప్‌ చేసిన స్పేస్‌ ఇచ్చి మీరు ముందే క్రియేట్‌ చేసిన వర్చువల్‌ ఐడీ నెంబర్‌లోని లాస్ట్‌ 6 అంకెలను ఎంటర్‌ చేయాలి. ఎస్‌ఎంఎస్ పంపగానే మీకు 6 అంకెల ఓటీపీ వస్తుంది. తర్వాత UNLOCKUID అని టైప్‌ చేసి స్పేస్ ఇచ్చి వర్చువల్ ఐడీలోని చివరి 6 అంకెలు ఎంటర్‌ చేసిన స్పేస్‌ ఇచ్చి 6 అంకెల ఓటీపీని ఎంటర్‌ చేసి ఎస్‌ఎమ్‌ఎస్‌ సెండ్‌ చేయాలి. వెంటనే మీ ఆధార్‌ కార్డు అన్‌లాక్‌ అవుతుంది. అన్‌లాక్‌ అయినట్లు మీకు కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ కూడా వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..