Hero Surge S32: చిరువ్యాపారులే లక్ష్యంగా ఆటో కమ్ స్కూటర్.. రెండు రకాలుగా వాడుకోవచ్చు.. అదెలా?
హీరోమోటోకార్ప్ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఒకటే వాహనాన్ని టూ వీలర్ గానూ అదే విధంగా త్రీ వీలర్ గానూ వినియోగించుకునేలా సంచలనాత్మక ఉత్పత్తిని లాంచ్ చేసింది. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినట్లుగా అప్పటికప్పుడు కారుగా ఉన్న వాహనం బైక్ మారిపోయే విధంగా ఈ కొత్త వాహనం కూడా మనకు కావాల్సినప్పుడు ఆటోలా వినియోగించుకోవచ్చు.

మన దేశంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ట్రెండ్స్ లో ఎలక్ట్రిక్ వాహన శ్రేణి ప్రథమ స్థానంలో ఉంది. దీంతో మార్కెట్లో ఈ వాహనాల తయారీదారుల మధ్య విపరీతమైన పోటీ వాతావరణం నెలకొంది. దీంతో కంపెనీ తమ మేధస్సుకు పదును పెడుతున్నాయి. అత్యాధునిక సాంకేతికతను వినియోగించి వాహనాల్లో కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ బైక్ ల తయారీదారు హీరోమోటోకార్ప్ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఒకటే వాహనాన్ని టూ వీలర్ గానూ అదే విధంగా త్రీ వీలర్ గానూ వినియోగించుకునేలా సంచలనాత్మక ఉత్పత్తిని లాంచ్ చేసింది. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినట్లుగా అప్పటికప్పుడు కారుగా ఉన్న వాహనం బైక్ మారిపోయే విధంగా ఈ కొత్త వాహనం కూడా మనకు కావాల్సినప్పుడు ఆటోలా వినియోగించుకోవచ్చు. అలాగే దానినే డిస్ కనెక్ట్ చేసి స్కూటర్ లానూ వాడుకోవచ్చు. దీనికి హీరో మోటోకార్ప్ సర్జ్ ఎస్32 ఎలక్ట్రిక్ స్కూటర్ అని పేరు పెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వెరైటీ వాహనం ఇలా..
హీరో మోటోకార్ప్ కంపెనీ ఈ వెరైటీ వాహనాన్ని పరిచయం చేసింది. దీని పేరు హీరో సర్జ్ ఎస్32 ఎలక్ట్రిక్ స్కూటర్. దీనిని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఆటోను స్కూటర్ గానూ మార్చుకొని వినియోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను సైతం కంపెనీ విడుదల చేసింది. జైపూర్లో జరిగిన హీరో వరల్డ్ 2024లో ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసింది. దీనికి మల్టీ పర్పస్ త్రీ వీలర్ కాన్సెప్ట్ గా తీసుకొచ్చింది. ఇది ఆటోగా ఉన్నా.. కొన్ని నిమిషాల్లోనే స్కూటర్ గా మారిపోతుంది. అదే సమయంలో స్కూటర్ ను కూడా బాడీని అటాచ్ చేసేస్తే ఆటోగా మారిపోతుంది.
మూడు నిమిషాల్లోనే..
హీరో కంపెనీ చెబుతున్న దాని ప్రకారం మూడు చక్రాలుగా ఈ వాహనం.. రెండు చక్రాల వాహనంగా మార్చడానికి కేవలం మూడు నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుందని చెబుతోంది. దీనిని నాలుగు వేరియంట్లలో దీనిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎస్32 పీవీ, ఎస్32ఎల్డీ, ఎస్32 హెచ్డీ, ఎస్32ఎఫ్బీ అనే వేరియంట్లు ఉన్నా ఈ ఏడాది ఎస్32 ఎల్డీని మాత్రమే హీరో ప్రదర్శించింది. స్కూటర్ గా కాస్త ఆటోగా మారిన తర్వాత సీట్లో ఇద్దరు కూర్చొనే అవకాశం ఉంటుంది.
పవర్ ట్రైన్ ఇది..
వ్యక్తిగత అవసరాలతో పాటు వాణిజ్య అవసరాలను కూడా ఒకే వాహనంలో తీర్చే విధంగా ఈ వాహనాన్ని హీరో పరిచయం చేసింది. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని టార్గెట్ చేసుకొనే హీరో కంపనీ దీనిని లాంచ్ చేసింది. అయితే పవర్ ట్రైన్ స్కూటర్ కు వేరుగా, ఆటోకు వేరుగా ఇచ్చారు. మూడు చక్రాలుగా కనెక్ట్ చేసినప్పుడు దీనికి 11కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కనెక్ట్ అవుతుంది. గరిష్ట వేగం గంటకు 45కిలోమీటర్లు ఉంటుంది. ఇక స్కూటర్ గా మార్చినప్పుడు దానిలోని రెండో బ్యాటరీని వినియోగించుకుంటుంది. ఇది సామర్థ్యం 3.5కేడబ్ల్యూహెచ్ ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి సంబంధించిన ధర, లభ్యత వంటివి కంపెనీ ఇంకా వెల్లడికాలేదు. దీనిని త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




