Commodities Prices: కొత్త ఆర్థిక సంవత్సరం.. ధరల్లో మార్పులివే.. పెరిగేవి, తగ్గేవి.. పూర్తి వివరాలు

Madhu

Madhu | Edited By: TV9 Telugu

Updated on: Apr 01, 2023 | 7:30 PM

ఫిబ్రవరి ఒకటో తేదీని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24లో కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో కొన్నింటిపై సుంకాలు పెంచగా.. మరొకొన్నింటిపై తగ్గించారు. దీనివల్ల సామాన్యులపై ప్రభావం ఎలా ఉంటుంది?

Commodities Prices: కొత్త ఆర్థిక సంవత్సరం.. ధరల్లో మార్పులివే.. పెరిగేవి, తగ్గేవి.. పూర్తి వివరాలు
Goods Price
Follow us

మార్చి నెల ముగిసింది. నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యింది. అయితే ఈ కొత్త ఆర్థిక సంవత్సంరలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి ఒకటో తేదీని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24లో కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో కొన్నింటిపై సుంకాలు పెంచగా.. మరొకొన్నింటిపై తగ్గించింది. దీని ప్రకారం సామాన్యులపై ఈ ప్రభావం పడుతుంది. పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్ని తగ్గుతాయి. అవేంటో ఓసారి చూద్దాం..

ఏప్రిల్ 1 నుంచి ధరలు తగ్గనున్న వస్తువులు

ఏప్రిల్ 1 , 2023 నుంచి చాలా రకాల వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతం తగ్గించి 2.5 శాతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా ఈ వస్తువుల ధరలు ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్నాయి. ఆ వస్తువులలో మొబైల్ ఫోన్, కెమేరా, ఎల్ఈడీ టీవీ, బయోగ్యాస్ సంబంధిత వస్తువులు, ఎలక్ట్రిక్ కార్లు, ఆట వస్తువులు, హీట్ క్వాయిల్, డైమెండ్ జ్యువెల్లరీ,సైకిళ్లు, లిథియం అయాన్ బ్యాటరీలు, కొన్ని రకాల బొమ్మలు, ఆటో మొబైల్స్ వంటి ధరలు తగ్గనున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఆ వస్తువుల ధరలు తగ్గినట్లు ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.

పెరిగేవి ఇవే..

ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరగనున్న వస్తువుల్లో బంగారం, వెండి, బంగారం-వెండితో తయారైన వస్తువులు, ప్లాటినం, ఇంపోర్టెడ్ డోర్స్, కిచెన్ చిమ్నీలు, విదేశీ ఆట వస్తువులు, సిగరెట్, ఎక్స్‌రే మిషన్ ఉన్నాయి. ఈ విషయం ఇప్పటికే అంటే ఫిబ్రవరి 1న సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. అలాగే పలు కార్ల కంపెనీలు కూడా ధరలు పెంచాయి. వాటిలో టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, మారుతి కంపెనీలు ధరలు పెరిగాయి. కొత్త ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Click on your DTH Provider to Add TV9 Telugu