Honda WR-V.. 2017లో తిరిగి ప్రారంభించబడిన WR-V ఇప్పుడు కొత్త ఉద్గార నిబంధనల కారణంగా మార్కెట్ నుండి నిష్క్రమించాల్సి వస్తోంది. ఇది ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్, డీజిల్, ఈ రెండింటి ఉత్పత్తిని నిలిపివేయనుంది. అయితే కార్లను నిలిపివేయడం వల్ల కంపెనీకి పెద్ద నష్టం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈ రెండు వేరియంట్ల సేల్స్ మన దేశంలో చాలా తక్కువగానే ఉన్నాయి. ఇక దీని స్థానంలో కొత్త కారు వస్తుందా? రాదా అన్ని విషయాన్ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.