Money Savings Tips: సొమ్ము పొదుపునకు ఈ తొమ్మిది టిప్స్‌ తప్పనిసరి.. దసరా రోజు తెలుసుకోండి మరి..!

ఆర్థిక నిపుణులు మాత్రం ప్రతి పండుగ పెట్టుబడికి మార్గంగా చూడాలని చెబుతున్నారు. ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆర్థిక అవసరాలను తీర్చుకునేలా పొదుపుపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పండుగ రోజు మంచి పని మొదలు పెట్టాలి కాబట్టి భవిష్యత్‌ అవసరాలను నెరవేర్చుకునేలా పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తున్నారు.

Money Savings Tips: సొమ్ము పొదుపునకు ఈ తొమ్మిది టిప్స్‌ తప్పనిసరి.. దసరా రోజు తెలుసుకోండి మరి..!
Saving Tips
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 23, 2023 | 7:00 PM

దేశంలో దసరా ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. దసరా అంటే పది రోజుల పండుగ. కానీ ఈ ఏడాది తిధులు తగులుమిగులు రావడంతో తొమ్మిది రోజుల పాటు పండుగ చేసుకుంటున్నారు. పండుగ అంటే ఇంటెళ్లిపాది ఆనందంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఆర్థిక నిపుణులు మాత్రం ప్రతి పండుగ పెట్టుబడికి మార్గంగా చూడాలని చెబుతున్నారు. ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆర్థిక అవసరాలను తీర్చుకునేలా పొదుపుపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పండుగ రోజు మంచి పని మొదలు పెట్టాలి కాబట్టి భవిష్యత్‌ అవసరాలను నెరవేర్చుకునేలా పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తున్నారు. అలాగే మన రోజువారీ జీవితంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పొదుపు చేయవచ్చు. ముఖ్యంగా పెట్టుబడి విషయంలో ఆర్థిక నిపుణులు సూచించే చర్యలు ఏంటో? ఓసారి తెలుసుకుందాం. 

ఆర్థిక లక్ష్యాలను సెట్ చేయడం

మన ఆర్థిక ప్రయాణం చక్కగా నిర్వచించే లక్ష్యాలతో ప్రారంభం కావాలి. తదుపరి సంవత్సరం ఐదు సంవత్సరాలు లేదా ఒక దశాబ్దం కోసం మీకు ఎలాంటి అవసరాలు వస్తాయో? ముందుగానే గ్రహించిన చర్యలు తీసుకోవాలి. అందుకు అనుగుణంగా నెలవారీ పొదుపు లక్ష్యాలను సెట్‌ చేసుకోవాలి. మీ పురోగతిని అంచనా వేయడానికి, ట్రాక్ చేయడానికి ఈ అంతర్దృష్టులను ఉపయోగించాలి. ఈ డేటా ఆధారిత విధానాన్ని పాటిస్తే సొమ్ము పొదుపు చేయడం సులభం అవుతుంది.

ఆర్థిక క్రమశిక్షణ

ప్రతి వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవాలి. భావోద్వేగాలకు లోనుకాకుండా స్థిరంగా పనిచేసే అల్గారిథమ్‌ల మాదిరిగానే మీరు మీ ఆర్థిక వ్యవహారాలను క్రమపద్ధతిలో నిర్వహించాలి. హఠాత్తుగా ఖర్చు చేయడం నివారించడంతో పాటు కొనుగోలుపై ఉన్న ఆకర్షణను నిరోధించాలి. ప్రతి పైసాతో ప్రయోజనం ఉందని తెలిసిన వాళ్లు ఖర్చుకు వెనకాడతారు. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

సంపద సృష్టి 

సంక్లిష్టమైన ఆర్థిక ప్రపంచంలో దీర్ఘకాలిక వ్యూహాలకు నిబద్ధత చాలా ముఖ్యం. ప్రత్యేకించి అనూహ్యతను ఎదుర్కొన్నప్పుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ దీర్ఘకాలిక ఆర్థిక ఆకాంక్షలపై  ఫోకస్‌ను కొనసాగించాలి.

తెలివిగా ఆదా చేయడం

దూరదృష్టి, ప్రణాళిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి బలమైన పొదుపు పునాదిని నిర్మించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా వైవిధ్యభరితమైన పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ రాబడిని పొందవచ్చు. పెట్టుబడి ఎంపికలకు మార్గనిర్దేశం చేయడానికి మంచి ఆర్థిక వ్యూహాలపై మొగ్గు చూపాలి. ప్రతి నిర్ణయానికి పరిశోధన చాలా ముఖ్యమని అర్థం చేసుకోవాలి.

నిపుణులను సంప్రదించడం

పెట్టుబడి విషయంలో చాలా కీలకంగా వ్యవహరించాలి. ఏయే పథకాలు మంచి రాబడినిస్తాయో? తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ రంగంలో నిపుణులు సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఎఫ్‌డీ వంటి పథకాల్లో పెట్టుబడికి ఏయే బ్యాంకులు అధిక వడ్డీనిస్తున్నాయో? తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టాక్స్‌ పెట్టుబడి విషయంలో మాత్రం కచ్చితంగా ఆర్థిక నిపుణులను సలహా తీసుకోవాలి. 

పెట్టుబడులను వైవిధ్యపరచడం

పెట్టుబడుల విషయంలో వైవిధ్యం పాటించడం చాలా ముఖ్యం. మొత్తం సొమ్మును ఒకే పథకంలో పెట్టుబడి పెట్టే బదులు వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రిన్సిపల్‌ అమౌంట్‌ సేఫ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆస్తుల కొనుగోలులో మీ పెట్టుబడులను పెట్టడం మంచిది. అయితే కొనుగోలుకు ముందు మొత్తం సమాచారాన్ని తెలుసుకోవాలి.

సమీక్ష

పెట్టుబడుల్లో అనుకూలత కోసం ఎప్పటికప్పుడు మన పెట్టుబడులను సమీక్షించుకోవాలి. ముఖ్యంగా మార్కెట్‌ వాతావరణానికి అనుగుణంగా మీ పోర్ట్‌ఫోలియోను రీకాలిబ్రేట్ చేయడం అత్యవసరం. మీ హోల్డింగ్‌లను క్రమం తప్పకుండా సమీక్షించాలి. ఇలా చేయడం ద్వారా ఎప్పటికప్పడు పెట్టుబడి వ్యూహాలను మార్చుకోవచ్చు. 

బీమా పథకాలు

పెట్టుబడి పెట్టే వారికి కచ్చితంగా బీమా పథకాలు మంచి ఎంపికగా నిలుస్తాయి. వీటిల్లో పెట్టుబడి ద్వారా ఆర్థిక రక్షణతో పాటు మనం లేకపోతే కుటుంబానికి ఆర్థిక రక్షణగా నిలుస్తాయి. జీవిత బీమాతో పాటు, ప్రత్యక్ష ఆస్తులపై సమగ్ర బీమా కవరేజీను పొందవచ్చు. 

అత్యవసర నిధి

పెట్టుబడుల విషయంలో మార్కెట్ ట్విస్ట్‌ల నేపథ్యంలో వ్యక్తిగత ఫైనాన్స్‌ను బలోపేతం చేసుకోవాలి. ముఖ్యంగా ఊహించని సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారిస్తుంది. అందుకు అనుగుణంగా మన అవసరాలకు తగినట్లు అత్యవసర నిధిగా ఉపయోగపడేలా సొమ్మును నిల్వ చేసుకోవాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..