AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan Prepay: హోమ్ లోన్ ముందస్తుగా చెల్లించడం లాభమా? నష్టమా? తెలుసుకోవాలంటే ఇది చదవండి..

వాస్తవానికి హోమ్ లోన్లు ఎక్కువ కాలానికి ఈఎంఐలు పెట్టుకునేందుకు అవకాశం ఇస్తుంది. అయితే మీకు దీని ద్వారా ఈఎంఐల భారం తగ్గినా వడ్డీ చెల్లించేది చాలా ఎక్కువ అవుతుంది. అసలు కన్నా వడ్డీనే ఎక్కువ అయిపోతోంది. దీని బారి నుంచి తప్పించుకునేందుకు అందరూ ప్రీ పేమెంట్ కోసం వెళ్తుంటారు. పైగా ఒకేసారి అప్పు మొత్తం చెల్లించినట్లయితే, మీరు అప్పుల సంకెళ్ల నుంచి విముక్తి పొందే అవకాశం ఉండటంతో దీనిని ఎక్కువ మంది వినియోగించుకుంటారు.

Home Loan Prepay: హోమ్ లోన్ ముందస్తుగా చెల్లించడం లాభమా? నష్టమా? తెలుసుకోవాలంటే ఇది చదవండి..
Bank Home Loan
Madhu
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 02, 2023 | 8:47 PM

Share

ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలన్నా.. కొనుక్కోవాలన్నా హోమ్ లోన్ తప్పనిసరి అయ్యింది. సాధారణంగా ఇతర లోన్లతో పోల్చితే దీనిలో వడ్డీ రేటు తక్కువ ఉండటంతో సులభవాయిదాలలో చెల్లించుకునే వెసులుబాటు ఉండటంతో అందరూ వీటిని వినియోగించుకుంటున్నారు. అయితే కొందరూ ఈ లోన్లు ముందస్తుగానే క్లోజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. తద్వారా ఈఎంఐల భారం తగ్గుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి హోమ్ లోన్లు ఎక్కువ కాలానికి ఈఎంఐలు పెట్టుకునేందుకు అవకాశం ఇస్తుంది. అయితే మీకు దీని ద్వారా ఈఎంఐల భారం తగ్గినా వడ్డీ చెల్లించేది చాలా ఎక్కువ అవుతుంది. అసలు కన్నా వడ్డీనే ఎక్కువ అయిపోతోంది. దీని బారి నుంచి తప్పించుకునేందుకు అందరూ ప్రీ పేమెంట్ కోసం వెళ్తుంటారు. పైగా ఒకేసారి అప్పు మొత్తం చెల్లించినట్లయితే, మీరు అప్పుల సంకెళ్ల నుంచి విముక్తి పొందే అవకాశం ఉండటంతో దీనిని ఎక్కువ మంది వినియోగించుకుంటారు. ఇది ఆచరణీయమైన ఎంపికే. అయితే, గృహ రుణాన్ని ముందస్తుగా చెల్లించడం వల్ల కలిగే లాభాలు ఎలా ఉన్నా? కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఈ ఆప్షన్ ఎంచుకునే ముందు వాటి గురించి తెలుసుకుంటే మంచిది. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ ప్రీపేమెంట్ వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి సమగ్ర సమాచారం ఇక్కడ అందిస్తున్నాం. చదివేయండి..

హోమ్ లోన్‌ను ప్రీపే అంటే..

హోమ్ లోన్‌ను ప్రీపే చేయడం అంటే, మీరు లోన్ వ్యవధి ముగిసేలోపు (పూర్తిగా లేదా పాక్షికంగా) తిరిగి చెల్లించేయడం. ఇది రుణ భారాన్ని తగ్గిస్తుంది. గణనీయమైన డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే రుణం వ్యవధి తగ్గుతుంది.

ముందు చెల్లించడం మంచిదే.. గృహ రుణాల గురించి మాట్లాడేటప్పుడు, ముందుగానే అదనపు చెల్లింపులు చేయడం మంచిదే. ఎందుకంటే ఇది దీర్ఘకాలంలో రుణ భారాన్ని తగ్గిస్తుంది. అదనపు మొత్తం చెల్లింపు రుణ వడ్డీ కంటే ప్రధాన రుణ మొత్తంగా మారుతుంది. సరళంగా చెప్పాలంటే, బాకీ ఉన్న లోన్‌లో తగ్గింపు ఆధారంగా, రాబోయే నెలల్లో వడ్డీ మొత్తం తగ్గించబడుతుంది. అయితే మీరు రుణాన్ని తిరిగే చెల్లించే సమయం కూడా మీకు ప్రయోజనాలు అందించడంలో సాయపడుతుంది. అధిక ప్రయోజనం చేకూరాలంటే ముందస్తు చెల్లింపు సమయం కూడా చాలా ముందే ఉండాలి.

ఇవి కూడా చదవండి

వడ్డీ రేటు.. బ్యాంక్ అధిక వడ్డీ రేటును వసూలు చేస్తున్నట్లయితే, మీ హోమ్ లోన్‌ను ముందస్తుగా చెల్లించడం మంచిది. దీంతో బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పు కూడా తగ్గుతుంది.

మిగులు నిధులు.. గుర్తుంచుకోవలసిన మరో అంశం మిగులు నిధుల మూలం (అదనపు నిధులు). మీ పొదుపు లేదా ఎమర్జెన్సీ ఫండ్‌లను నుంచి మీ హోమ్ లోన్‌ని తిరిగి చెల్లించడం తెలివైన ఆలోచన కాదు. ఈ చర్య ఏదైనా ఆర్థిక అవసరం సమయంలో మిమ్మల్ని బలహీన స్థితిలో ఉంచవచ్చు.

హోమ్ లోన్ ప్రీపే చేయడం వల్ల కలిగే నష్టాలు..

మీరు మీ హోమ్ లోన్‌ను ముందస్తుగా చెల్లిస్తే, తర్వాత కాలంలో ప్రయోజనాలు పెద్దగా ఉండవు. అంతే కాకుండా, రుణగ్రహీతలు సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును కోల్పోవచ్చు. గృహ రుణంపై చెల్లించే వడ్డీపై రూ. 2 లక్షల వరకు మినహాయింపు ఉంది. ముందస్తు చెల్లింపు విషయంలో ఈ తగ్గింపులు చెల్లవు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..