Tata Upcoming Cars: కొత్త సంవత్సరంలో టాటా కొత్త కార్ల జాతర.. జాబితా ఇదే..
రానున్న కొన్ని నెలల్లో టాటా కొన్ని కార్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దానిలో ఎలక్ట్రిక్, సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు సీఎన్జీ వెర్షన్ కూడా ఉన్నాయి. వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి వచ్చే ఈ మోడళ్లను ఇప్పటికే టాటా ప్రదర్శించింది. టాటా హారియర్, సఫారీ ఎస్యూవీలను అప్ గ్రేడ్ చేస్తుండగా.. టైగోర్, పంచ్, అల్ట్రోజ్ వంటి కాంపాక్ట్ ఎస్యూవీ, సెడాన్ కార్లను కూడా సరికొత్తగా రానున్న రోజుల్లో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
టాటా కంపెనీ అంటేనే మన దేశంలో చాలా మంచి గుర్తింపు ఉంది. ఈ కంపెనీ కార్లపై కూడా ఓ భరోసా ఉంటుంది. అందుకే టాటా నుంచి కొత్త కార్లు వస్తున్నాయంటే దేశ వ్యాప్తంగా అటెన్షన్ ఉంటుంది. రానున్న కొన్ని నెలల్లో టాటా కొన్ని కార్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దానిలో ఎలక్ట్రిక్, సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు సీఎన్జీ వెర్షన్ కూడా ఉన్నాయి. వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి వచ్చే ఈ మోడళ్లను ఇప్పటికే టాటా ప్రదర్శించింది. టాటా హారియర్, సఫారీ ఎస్యూవీలను అప్ గ్రేడ్ చేస్తుండగా.. టైగోర్, పంచ్, అల్ట్రోజ్ వంటి కాంపాక్ట్ ఎస్యూవీ, సెడాన్ కార్లను కూడా సరికొత్తగా రానున్న రోజుల్లో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
టాటా పంచ్ ఈవీ..
టాటా నుంచి వస్తున్న చిన్న ఎస్యూవీ కారు ఇది. దీనిని హ్యూందాయ్ ఎక్స్ టర్. ఈ పంచ్ కారు పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పాటు సీఎన్జీ కిట్ తో కూడినవి ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో టాటా మోటార్స్ ఓ ప్రకటన చేసింది. అదేంటంటే 2024 మొదటి నెలల్లోనే నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయనున్నట్లు చెప్పింది. వాటిల్లో పంచ్ ఈవీ కూడా ఉంది. ఇప్పటికే ఉన్న పంచ్ ఈవీ వెర్షన్ ను మరింత అప్ గ్రేడ్ చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనిలో జిప్ ట్రాన్ టెక్నాలజీని వినియోగించారు. బ్యాటరీ టైగోర్ ఈవీ లేదా నెక్సాన్ ఈవీలో మాదిరిగానే ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 300 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
టాటా కర్వ్ ఈవీ..
ఈ కారు కాన్సెప్ట్ ను 2022లో టాటా మోటార్స్ హైలైట్ చేసింది. ఐసీఈ వెర్షన్ ను ఈ ఏడాది జరిగిన ఆటో ఎక్స్ పోలో దీనిని ప్రదర్శించింది. ఇప్పుడు దీని ఈవీ వెర్షన్ కూడా సిద్ధమైనట్లు టాటా మోటార్స్ ఎండీ సైలేష్ చంద్ర ప్రకటించారు. ఈ కర్వ్ ఎస్యూవీ కారు హ్యూందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ గ్రాండ్ విటారాలకు గట్టి పోటినిచ్చే విధంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది సింగిల్ చార్జ్ పై 400 నుంచి 500కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
టాటా హ్యారియర్ ఈవీ..
ఈ కారును కూడా ఆటో ఎక్స్ పో 2023లో ఆవిష్కరించారు. దీనిని 2024లో మార్కెట్లకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది జెన్ 2 ఈవీ ఆర్కిటెక్చర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది వీ2ఎల్, వీ2వీ చార్జింగ్ ఫెసిలిటీలతో వస్తోంది. దీని పవర్ ట్రైన్, స్పెసిఫికేషన్స్ ను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
టాటా ఆల్ట్రోజ్ రేసర్..
టాటా కంపెనీ ఆల్ట్రోజ్ మరింత శక్తివంతంగా రూపొందించి, మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇది స్పోర్టీ లుక్ కనిపిస్తుంది. దీనిలో 1.2 లీటర్ టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఇది 120 బీహెచ్ పీ, 170 ఎన్ఎం పీక్ టార్క్ ను కలిగి ఉంటుంది. ఇది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది.
టాటా నెక్సాన్ సీఎన్జీ..
మన దేశంలో అమ్ముడవుతున్న టాటా మోటార్స్ బెస్ట్ ఎస్ యూవీ కారు ఇది. ప్రస్తుతం ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో వస్తుంది. ట్విన్ సిలెండర్ ఐసీఎన్జీ టెక్నాలజీతో ఇది వస్తుంది.
ఇవి కాక, టాటా సీయారా ఈవీ, టాటా ఆల్ట్రోజ్ ఈవీ, టాటా కర్వ్ ఐసీఈ వంటి మోడళ్లు కూడా లాంచింగ్ రెడీ అవుతున్నాయి. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది అంటే 2024 మొదటి త్రైమాసికంలోనే వీటిన్నంటినీ మార్కెట్లోకి విడుదల చేసేందుకు టాటా ఏర్పాట్లు చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..